Site icon HashtagU Telugu

Janasena Formation Day : హృదయపూర్వక శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ అన్న – లోకేష్

Pawan Kalyan, Nara Lokesh

Pawan Kalyan, Nara Lokesh

జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం (Janasena Formation Day ) సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)కు మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh)హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్‌తో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ అభినందనలు తెలియజేస్తూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. జనసేన పార్టీ రాష్ట్ర ఆర్థిక, సంక్షేమ అభివృద్ధికి పాటుపడుతుందని, ఆ పార్టీ కృషి ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును అందించగలదనే నమ్మకం తనకుందని లోకేశ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా “జనసేన జయకేతనం” హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు.

Lip Balms: వేసవిలో పొడిబారిన పెదవులు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే ఇది మీకోసమే!

టీడీపీ-జనసేన పొత్తు తర్వాత ఈ దినోత్సవానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఏర్పడింది. రెండు పార్టీలు కలిసి విజయం సాధించిన తర్వాత జరుపుకుంటున్న జనసేన ఆవిర్భావ వేడుక కావడం గమనార్హం. గత ఎన్నికల్లో పొత్తుగా పోటీ చేసిన టీడీపీ-జనసేన కూటమి అఖండ విజయాన్ని సాధించింది. ఇందులో జనసేన పాత్ర కీలకంగా మారిందని లోకేశ్ ప్రశంసించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పాలనలో భాగస్వామిగా ఉన్న జనసేన, ప్రజలకు నిబద్ధతతో సేవ చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

జనసేన భవిష్యత్తు దిశగా ఇంకా బలంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ లోకేశ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీడీపీ-జనసేన మధ్య బంధాన్ని ఇది మరింత బలపరిచిందని విశ్లేషకులు అంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన దూసుకుపోతుండటంతో, లోకేశ్ శుభాకాంక్షలు అందరికీ ప్రేరణగా మారుతున్నాయి.