Yuvagalam : నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికేందుకు సిద్దమైన టీడీపీ – జనసేన నేతలు

యాత్ర ఎక్కడైతే ఆగిపోయిందో తిరిగి అక్కడి నుంచే యాత్రను రేపటి నుండి ప్రారభించబోతున్నారు

  • Written By:
  • Publish Date - November 26, 2023 / 04:08 PM IST

చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) తో ఆగిపోయిన నారా లోకేష్ యువగళం (Yuvagalam) యాత్ర రేపటి నుండి పున:ప్రారంభం (Restart) కాబోతుంది. ఈ క్రమంలో నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ – జనసేన (TDP-Janasena) నేతలు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ 9వ తేదీన రాజోలు (Rajole) నియోజక వర్గంలో పాదయాత్ర నిలిచిపోయిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టుతో పాదయాత్రను నిలిపివేశారు. దాదాపు రెండున్నర నెలలుగా పాదయాత్ర నిలిచిపోయింది.

We’re now on WhatsApp. Click to Join.

యాత్ర ఎక్కడైతే ఆగిపోయిందో తిరిగి అక్కడి నుంచే యాత్రను రేపటి నుండి ప్రారభించబోతున్నారు. యువగళం పాదయాత్ర మళ్లీ మొదలవుతోందన్న వార్తతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. లోకేశ్ యువగళం పాదయాత్ర జనవరి 27న కుప్పంలో ప్రారంభమైంది. 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని లోకేశ్ సంకల్పించారు. ఇప్పటివరకు లోకేశ్ 209 రోజుల పాటు పాదయాత్ర చేశారు. 2852.4 కి.మీ. దూరం నడిచారు.

ఇప్పటి వరకు లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు టీడీపీ పార్టీ మాత్రమే సంఘీభావం ప్రకటించేది. ఆ పార్టీ నేతలు మాత్రమే పాదయాత్రలో పాల్గొనేవారు. కానీ ఇప్పుడు టీడీపీ తో జనసేన పొత్తు కుదరడం తో జనసేన శ్రేణులు సైతం పెద్ద ఎత్తున యువగళం యాత్రలో పాల్గొనబోతున్నారు. ఇరు పార్టీల నేతలు లోకేష్ కు స్వాగతం చెప్తూ ఫ్లెక్సీలు, కటౌట్లతో రోడ్లన్నీ నింపేస్తున్నారు. రాజోలు నియోజకవర్గం నుంచి అమలాపురం వరకు రోడ్డు మార్గంలో భారీగా కటౌట్లు, ఫ్లెక్సీలతో నిండిపోయాయి.

Read Also : Rahul Gandhi : దొరల సర్కార్‌కు ప్రజల సర్కార్‌కు మధ్య పోటీ – రాహుల్