Lokesh Strategy : అసెంబ్లీకి టీడీపీ సిద్ధం, వ్యూహం మార్పు.!

Lokesh Strategy : ఏపీ అసెంబ్లీ స‌మావేశాల‌కు ప్ర‌తిప‌క్షం హాజ‌రు కానుందా? శాశ్వ‌తంగా బ‌హిష్క‌రించి వెళ్ల‌నుందా?

  • Written By:
  • Updated On - September 20, 2023 / 05:47 PM IST

Lokesh Strategy : ఏపీ అసెంబ్లీ స‌మావేశాల‌కు ప్ర‌తిప‌క్షం హాజ‌రు కానుందా? శాశ్వ‌తంగా బ‌హిష్క‌రించి వెళ్ల‌నుందా? జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టే అవ‌కాశం ఉందా? ఎలాంటి వ్యూహాన్ని టీడీపీ ర‌చించ‌నుంది? అనేదానిపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ మాత్రం అసెంబ్లీకి టీడీపీ హాజ‌రు కానుంద‌ని ఢిల్లీ వేదిక‌గా స్ప‌ష్టం చేశారు. అయితే, పార్టీ వ్యూహం ఏమిటి? అనేది మాత్రం ఉత్కంఠ‌గా ఉంది.

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల‌కు ప్ర‌తిప‌క్షం హాజ‌రు (Lokesh Strategy)

అసెంబ్లీ స‌మావేశాల‌కు సిద్ద‌మ‌వుతోన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ ప‌లు బిల్లుల‌ను ఆమోదించ‌నుంది. బ‌హుశా ఈ స‌మావేశాలు ముగిసిన త‌రువాత ఎన్నిక‌ల హ‌డావుడి ఏపీలో సంపూర్ణంగా ప్రారంభం కానుంది. అందుకే, పక్కా ఎన్నిక‌ల స‌మావేశాల మాదిరిగా జ‌ర‌గ‌బోతున్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో ఉన్నారు. స‌ర్కార్ తీరుకు నిర‌స‌న‌గా చంద్ర‌బాబు అసెంబ్లీని గత ఏడాది బ‌హిష్క‌రించారు. స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి మీద వైసీపీ స‌భ్యులు చేసిన అనుచిత వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో అసెంబ్లీని (Lokesh Strategy) శాశ్వ‌తంగా బ‌హిష్క‌రించారు. మ‌ళ్లీ సీఎం గా మాత్ర‌మే వ‌స్తానంటూ చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. ఆ క్ర‌మంలో ప్ర‌తిప‌క్ష‌నేత‌గా అచ్చెంనాయుడు లీడ్ చేయ‌నున్నారు.

ప్ర‌తిప‌క్ష‌నేత‌గా అచ్చెంనాయుడు లీడ్

తొలి రోజే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ అరాచ‌కాల మీద వాయిదాతీర్మానం పెట్ట‌డానికి టీడీపీ సిద్ద‌మ‌యింది. ఒక వేళ కాదంటే, నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ బ‌హిష్క‌రించ‌నుంది. అసెంబ్లీ లోప‌ల‌, వెలుప‌ల స‌ర్కార్ అరాచ‌కాల‌ను బ‌య‌ట‌పెట్ట‌డానికి వ్యూహాలకు ప‌దునుపెడుతోంది. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా చంద్ర‌బాబును జైలుకు పంప‌డాన్ని నిర‌సిస్తూ రిలే నిరాహాదీక్ష‌లు చేస్తున్నారు. వివిధ రూపాల్లో టీడీపీ క్యాడ‌ర్ ఆందోళ‌న‌ల‌ను చేస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఐటీ రంగ నిపుణులు చంద్ర‌బాబు అరెస్ట్ ను నిర‌సిస్తూ ధ‌ర్నాలు చేస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల న‌డుమ జ‌రిగే అసెంబ్లీ  (Lokesh Strategy) స‌మావేశాల్లోనూ ఇదే అంశాన్ని టీడీపీ ప్ర‌ధానంగా ప్ర‌స్తావించ‌నుంది.

Also Read : BRS Twist on Modi : మోడీలేపిన విభ‌జ‌న గాయం!ఎన్నిక‌ల అస్త్రంగా బీఆర్ఎస్!!

ప్ర‌స్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్ జాతీయ స్థాయిలో మ‌ద్ధ‌తు కూడ‌గ‌డుతున్నారు. హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా, బిఎస్పీ ఎంపీలు కున్వార్ డ్యానిష్ ఆలీ, రితేష్ పాండే ఆయ‌న్ను ప‌రామ‌ర్శించారు. అంతిమంగా న్యాయ‌మే గెలుస్తుంద‌ని లోకేష్ కు ధైర్యం చెప్పారు. గ‌త వారం రోజులుగా ఢిల్లీలోనే ఉన్న లోకేష్ ను రాష్ట్రానికి వ‌స్తే సీఐడీ అరెస్ట్ చేస్తుంద‌ని టాక్‌. అందుకే, ఆయ‌న రాష్ట్రానికి రావ‌డంలేద‌ని వైసీపీ చెబుతోంది. అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా హాజ‌ర‌యితే, శుక్ర‌వారంనాడు ఆయ‌న్ను అరెస్ట్ చేయ‌డానికి సీఐడీ స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఈసారి అసెంబ్లీ స‌మావేశాలు ఉత్కంఠ న‌డుమ సాగుబోతున్నాయి.

Also Read : Jagan Cabinet Inside : మంత్రివ‌ర్గంలో `ముంద‌స్తు`టాక్స్