Site icon HashtagU Telugu

Chandrababu Remand: నాతో కలిసి వచ్చేది ఎవరు?

Chandrababu Remand

New Web Story Copy 2023 09 11t091455.426

Chandrababu Remand:మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ పై తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. చేయని నేరానికి తన తండ్రిని అన్యాయంగా రిమాండ్‌కు తరలించడం చూసి తన ఆగ్రహం కట్టలు తెంచుకుందని, రక్తం ఉడికిపోయిందని అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో విజయవాడలోని కోర్టు నాయుడుని 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపిన అనంతరం లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశాడు. బాధతో బరువెక్కిన హృదయంతో ఉన్నానని లోకేష్ చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం మా నాన్న ఎంతో కృషి చేశాడు. లక్షలాది మంది జీవితాలను మార్చేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్న ఆయనకు విశ్రాంతి తీసుకునే రోజు కూడా తెలియదు అన్నారు.

అమెరికాలో సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదిలి భారతదేశానికి తిరిగి వచ్చాను. ఇది చాలా కఠినమైన నిర్ణయం. నాకు మన దేశం, మన వ్యవస్థలు, అన్నింటికంటే మించి మన రాజ్యాంగంపై నమ్మకం ఉంది. అయినప్పటికీ ఈ రోజు మా నాన్న ఎప్పుడూ చేయని నేరానికి అన్యాయంగా రిమాండ్‌కు వెళ్లడం చూస్తుంటే, నా కోపం ఉప్పొంగింది మరియు నా రక్తం ఉడికిపోతుందని అన్నారు. అతను ఎప్పుడూ విధ్వంసక రాజకీయాలకు దిగలేదు. శత్రు రాజకీయాలకు పాల్పడలేదని చెప్పారు. మా నాన్న ఒక పోరాట యోధుడు. ఆయనకోసం నాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు తోడుగా నిలవాలని చెప్పారు. ఈ యుద్ధంలో నాతో కలిసిరావాలని నేను మిమ్మల్ని అడుగుతున్నాను అని లోకేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Also Read: TDP : విజ‌య‌వాడ బ‌స్‌స్టాండ్ వ‌ద్ద టీడీపీ నేత‌ల ఆందోళ‌న‌.. ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ స‌హా ప‌లువురు అరెస్ట్‌