Nara Lokesh : లోకేష్ ‘మా’ గుండెచప్పుడు – మంగళగిరి ప్రజలు

Nara Lokesh : మంగళగిరి నియోజకవర్గ ప్రజల ఇబ్బందుల పట్ల నారా లోకేష్ చూపిస్తున్న స్పందన ప్రజల మన్ననలు పొందుతోంది

Published By: HashtagU Telugu Desk
Nara Lokesh

Nara Lokesh

నారా లోకేష్ (Nara Lokesh) ‘మా’ గుండె చప్పుడు అంటున్నారు మంగళగిరి(Mangalagiri) ప్రజలు. మంగళగిరి నియోజకవర్గ ప్రజల ఇబ్బందుల పట్ల నారా లోకేష్ చూపిస్తున్న స్పందన ప్రజల మన్ననలు పొందుతోంది. ఎన్నికల సమయంలో వాకింగ్ కు వెళ్లే అటవీ పార్క్‌కు డబ్బులు కట్టాల్సిన పరిస్థితిని పరిష్కరిస్తానని ఇచ్చిన చిన్న హామీని కూడా ఆయన గుర్తుంచుకుని, ప్రభుత్వం సాధ్యం కాకపోయినా తన సొంత నిధులతో నెరవేర్చడం ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది. ఈ చిన్న హామీకి ఈ స్థాయిలో స్పందించిన లోకేష్, మరింత ముఖ్యమైన హామీల పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరిస్తారో ప్రజలు అర్థం చేసుకున్నారు.

HCU: ఈ’ స్టేట్ ‘మనదిరా! ఈ’ భూమి’ మనదిరా!!

ఇళ్ల సమస్యల విషయంలోనూ లోకేష్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. గతంలో “లోకేష్ గెలిస్తే ఇళ్లు తొలగిస్తారు” అన్న ప్రచారం కారణంగా ఓడిపోయిన విషయం గుర్తుండగా, ఈసారి ఈ అంశంలో ఆయన పక్కాగా వ్యవహరిస్తున్నారు. ఇళ్లు నిర్మించుకున్న పేదలకూ చట్టబద్ధంగా పట్టాలు ఇవ్వడానికి కేబినెట్ స్థాయిలో నిర్ణయాలు తీసుకుని, స్వయంగా ఇంటికి వెళ్లి పత్రాలు అందిస్తున్నారు. అటవీ భూముల్లో ఇళ్లు ఉన్నవారికీ మూడో దశలో పత్రాలు అందించనున్నట్లు స్పష్టం చేశారు.

Gold Price : భారీగా తగ్గిన బంగారం

అభివృద్ధి పనులపైనా లోకేష్ ఎక్కడా వెనుకడుగు వేయడం లేదు. గ్రామాల్లో చిన్న పెద్ద పనులన్నిటికీ నిధులు కేటాయించి, ప్రజల అవసరాలను తీర్చడంలో ఆయన చొరవగా వ్యవహరిస్తున్నారు. అలాగే ప్రజల వ్యక్తిగత కార్యక్రమాల్లో పాల్గొని, వారి కష్టసుఖాల్లో భాగస్వాములవుతుండడం ద్వారా ప్రజల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. నారా లోకేష్ ఇప్పుడు మంగళగిరి ప్రజలకి ఆత్మీయంగా ఉండే నాయకుడిగా మారారు.

  Last Updated: 04 Apr 2025, 12:06 PM IST