Site icon HashtagU Telugu

Lokesh Law : లోకేష్ స‌రికొత్త పంథా

Lokesh Law

Lokesh Mahanadu

ప్ర‌జాస్వామ్యబ‌ద్ధంగా పోరాటం (Lokesh Law) చేయ‌డానికి టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ సిద్ధ‌మ‌య్యారు. ఆయ‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను నిరూపించాల‌ని కోర్టుకెక్కారు. అందుకు సంబంధించిన వాగ్మూలం ఇవ్వ‌డానికి శుక్ర‌వారం మంగ‌ళ‌గిరి కోర్టులో హాజ‌ర‌య్యారు. ఆ సంద‌ర్భంగా న్యాయ‌పోరాటం చేయాల‌ని క్యాడ‌ర్ కు పిలుపునివ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప‌త్రిక‌లు, మీడియా ఛాన‌ళ్లు, సోష‌ల్ మీడియా వ్యాప్తంగా వ‌స్తోన్న అబ‌ద్ధ‌పు వార్త‌ల‌పై లీగ‌ల్ ఫైట్ కు సిద్ధ‌మ‌య్యారు. ప్ర‌త్యేకించి బ్లూ మీడియా చేస్తోన్న రాద్ధాంతాన్ని ఆపాల‌ని న్యాయ‌పోరాటంకు దిగారు.

ప్ర‌జాస్వామ్యబ‌ద్ధంగా పోరాటం టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ (Lokesh Law)  

సాధార‌ణంగా త‌ప్పు చేసిన వాళ్ల‌పై కేసు న‌మోదు అవుతుంది. కానీ, ఏ త‌ప్పు చేయ‌కుండా క్రియేట్ చేసిన కేసుల‌ను (Lokesh Law) కూడా ఎదుర్కోవ‌డం తాజా ప‌రిణామం. కేసు బుక్ చేసిన వెంట‌నే మీడియాలో వార్త‌ల‌ను వండివారుస్తున్నారు. ఆ క్ర‌మంలో ఏపీ సీఐడీ కేసు న‌మోదు చేసిన వెంట‌నే బ్లూ మీడియా మాజీ మంత్రి లోకేష్ మీద పుంకానుపుంకాలుగా న్యూస్ క్రియేట్ చేసింది. దానికి రాజ‌ముద్ర‌వేసేలా ప్ర‌భుత్వ స‌ల‌హాదారు అజ‌య్ క‌ల్లాం ప‌లు ఆరోప‌ణ‌లు చేస్తూ స్కిల్ డ‌వ‌లెప్మెంట్ ప్రోగ్రామ్ లో అవినీతి అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో లోకేష్ మీద కేసును మ‌రింత లోతుగా సీఐడీ విచార‌ణ చేస్తుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, మీడియాలో వ‌చ్చిన న్యూస్ మిన‌హా ఎలాంటి ఆధారాలు ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు ల‌భించ‌లేదు.

మీడియా చేస్తోన్న ఆరోప‌ణ‌ల‌పై న్యాయ‌పోరాటం చేయాల‌ని క్యాడ‌ర్ కు లోకేష్ పిలుపు

ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా ఉన్న అజ‌య్ క‌ల్లాం చేసిన ఆరోప‌ణ‌లు మాజీ మంత్రి లోకేష్ ప‌రువుకు (Lokesh Law) సంబంధించిన అంశం. అందుకే, ఆయ‌న న్యాయ‌పోరాటం దిశ‌గా అడుగులు వేశారు. ఆరోప‌ణ‌ల‌ను నిరూపించాల‌ని కోరుతున్నారు. ఆ మేర‌కు కోర్టుల‌ను అభ్య‌ర్థించారు. ఇదే త‌ర‌హాలో టీడీపీ మీద ఒక విభాగం మీడియా చేస్తోన్న ఆరోప‌ణ‌ల‌పై న్యాయ‌పోరాటం చేయాల‌ని క్యాడ‌ర్ కు లోకేష్ పిలుపునిచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు విచ్చ‌ల‌విడిగా టీడీపీ మీద సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌త్య‌ర్థులు దుమ్మెత్తిపోశారు. ఇక రాబోవు రోజుల్లో ప్ర‌తి అంశాన్ని ప‌రిశీలించ‌డం ద్వారా న్యాయ‌పోరాటం చేయాల‌ని లోకేష్ క్యాడ‌ర్ సంకేతాలు ఇచ్చారు.

Also Read : TDP Councillor: చెప్పుతో కొట్టుకున్న టీడీపీ కౌన్సిలర్, అభివృద్ధి జరగడం లేదని ఆగ్రహం

సాధార‌ణంగా మీడియాలో ఒక వేళ ఫాల్స్ న్యూస్ వ‌స్తే ఖండించ‌డం స‌ర్వ‌సాధార‌ణంగా ఉంటుంది. ప్ర‌స్తుతం అలాంటి ఖండ‌న‌ల‌కు విలువ‌లేకుండా పోయింది. అందుకే, రెండో అవ‌కాశం న్యాయ‌పోరాటం. దాన్నే టీడీపీ ఎంచుకుంది. న్యాయ పోరాడం చేయ‌డం ద్వారా బ్లూ మీడియా చేస్తోన్న రాద్దాంతాన్ని అడ్డుకోవాల‌ని చేస్తోంది. ఆల‌స్యంగానైనా న్యాయం (Lokesh Law) చేకూరుతుంద‌ని ఆయ‌న భావిస్తున్నారు. అందుకే, కోర్టుల ద్వారా న్యాయ‌పోరాటం చేయాల‌ని మంగ‌ళ‌గిరి వేదిక‌గా లోకేస్ పిలుపునివ్వ‌డం కొస‌మెరుపు.

Also Read : Political Proffessor CBN : రాయ‌ల‌సీమ‌ద్రోహి జ‌గ‌న్ టైటిల్ తో చంద్ర‌బాబు `PPT`

అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలోనూ ప‌లు ఆరోప‌ణ‌ల‌ను చంద్ర‌బాబు కుటుంబం మీద వైసీపీ చేసింది. ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింద‌ని ఏపీ సీఐడీ కేసు న‌మోదు చేసింది. ఆ త‌రువాత అసైన్డ్ ల్యాండ్స్ కొనుగోలు చేశార‌ని ఆరోప‌ణ‌లు చేసింది. మాజీ సీఎం చంద్ర‌బాబు బినామీలు ఉన్నార‌ని కేసులు న‌మోదు చేసి విచార‌ణ చేప‌ట్టింది. కానీ, ఏ కేసూ నిల‌బ‌డ‌లేదు. ఆ త‌రువాత ఫైబ‌ర్ నెట్‌, స్కిల్ డ‌వ‌లెప్మెంట్ ప్రాజెక్టుల్లో అవినీతి, అక్ర‌మాలు జ‌రిగాయ‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ ఆరోప‌ణ‌లు చేసింది. కానీ, ఇప్ప‌టికీ నిరూపించ‌లేక‌పోయింది. అందుకే, నిజాల‌ను బ‌య‌ట‌కు తీసుకురావ‌డానికి న్యాయం పోరాటానికి దిగారు లోకేష్‌.