Nara Lokesh : తెలుగుదేశం పార్టీ శ్రేణులు అధికారంలో ఉన్నారనే అహంకారంలో కాకుండా, ఎప్పటికప్పుడు ప్రజల మధ్య ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు తిరస్కరించారన్న దానికి అహంకారమే కారణమని గుర్తు చేస్తూ, ఇప్పుడు అలాంటి తప్పు జరగకూడదని హెచ్చరించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో లోకేశ్ మాట్లాడారు. ప్రజల మద్దతుతో ఏర్పడిన కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘‘సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికీ తెలుగుదేశం’’ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఒక నెల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రతి కార్యకర్త, నాయకుడు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాలన, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని పిలుపునిచ్చారు.
Internet: ఇంటర్నెట్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. రాబోయే ఐదేళ్లలో!
‘‘151 సీట్లు గెలిచిన పార్టీ 11కే పరిమితమైందంటే అది వారి అహంకార పూరిత పాలన వల్లే. మనం ఆ బాటలో వెళ్లకూడదు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్ష భావనతో ప్రజల మధ్య ఉండాలి,’’ అని లోకేశ్ స్పష్టం చేశారు. కార్యకర్తల కష్టమే విజయంలో ప్రధాన పాత్ర పోషించిందని పేర్కొంటూ, అలాంటి కార్యకర్తల కృషిని గుర్తించి, వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
పార్టీ కమిటీల నియామకంపై కూడా లోకేశ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. జూలై 5వ తేదీ లోగా అన్ని కమిటీలను పూర్తిచేయాలని, మహిళలకు అధిక స్థానం కల్పించాలని, అనుబంధ విభాగాలను బలోపేతం చేయాలని తెలిపారు. సీనియర్ల అనుభవాన్ని, యువతలోని ఉత్సాహాన్ని సమన్వయం చేసుకుంటూ పార్టీ మరింత బలపడాలన్నారు.
‘‘ప్రపంచం ఎంత తిప్పినా మన గమ్యం పార్టీ కార్యాలయమే. ఆ కార్యాలయం పైనే దాడి జరిగిందని మరిచిపోకండి. ప్రతి పిలుపు ప్రాధాన్యం కలిగినదే. ప్రజలే తుది నిర్ణయం తీసుకునే శక్తి’’ అని లోకేశ్ చురకలు వేశారు.
Anchor Swetcha Votarkar : తన రెండు కళ్లను దానం చేసిన యాంకర్ స్వేచ్ఛ