Site icon HashtagU Telugu

Nara Lokesh : లోకేష్ నోటివెంట క్షమాపణలు ..ఎందుకంటే..!!

water problem

water problem

టీడీపీ యువనేత , మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) నోటి వెంట క్షమాపణలు (Sorry) రావడం ఆయనలోని గొప్పతనాన్ని చెప్పకనే చెప్పాయి. కేవలం రాజకీయ వ్యవహారాల్లోనే కాదు సోషల్ మీడియా లో లోకేష్ నిత్యం యాక్టివ్ గా ఉంటాడనే సంగతి తెలిసిందే. ఎవరు ఏ ఆపదలో ఉన్న , ఎవరు ఎలాంటి కష్టంలో ఉన్న తక్షణమే స్పందించి వారిని ఆదుకుంటుంటారు. అలాగే సమస్యల గురించి తన దృష్టికి వచ్చిన వెంటనే వాటిని పరిష్కరిస్తూ ఉంటారు. ఈ క్రమంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి సంబంధించి నెట్టింట ఓ వీడియో వైరల్ కాగా దానిపై స్పందించారు.

Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం భారీ ప్యాకేజ్..చంద్రబాబు ఎమోషనల్

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ దర్శనానికి నిత్యం జనం భారీగా తరలివస్తుంటారు. అయితే దుర్గ గుడిలో తాగునీటి సమస్య ఉందంటూ.. ఈ విషయాన్ని కొంతమంది భక్తులు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలోని ప్రసాదం కౌంటర్ వద్ద తాగునీరు అందుబాటులో లేదని.. నిర్వహణ కూడా సరిగా లేదంటూ నారా లోకేష్‌కు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా అందుకు జత చేశారు. అసలు విజయవాడ దుర్గ గుడికి ఈవో ఉన్నారా అంటూ భక్తులు ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితిని చూడటం చాలా దురదృష్టకరమని పేర్కొంటూ.. దీనిపై చర్యలు తీసుకోవాలని నారా లోకేష్‌ను కోరారు.

దీనికి వెంటనే లోకేష్ స్పందించారు. తాగు నీటి సమస్యపై భక్తులందరికీ క్షమాపణలు చెప్తున్నానంటూ ట్వీట్ చేశారు. తాగు నీటి సమస్యను గుర్తించి ఇప్పటికే సంబంధిత శాఖకు తెలియజేశామని నారా లోకేష్ బదులిచ్చారు. ఇలాంటి తప్పులు మరోసారి జరగకుండా చూసుకుంటామంటూ హామీ ఇచ్చారు.