Kapu Leaders in AP: ఏపీలో `కాపు` క‌ల‌క‌లం!

ఏపీలో కాపు సామాజిక‌వ‌ర్గం కింగ్ మేక‌ర్ అవుతుంద‌ని ప్ర‌ధాన పార్టీల అంచ‌నా. అందుకే ఆ సామాజిక‌వ‌ర్గం మ‌ద్ధ‌తు కోసం ప‌లు ప్ర‌య‌త్నాల‌ను టీడీపీ, వైసీపీ చేస్తున్నాయి. జ‌న‌సేన రూపంలో కాపు సామాజిక‌వ‌ర్గం ఓటు బ్యాంకు వెళ్లిపోతుంద‌ని వైసీపీ ఆందోళ‌న‌. ఆ ఓటు బ్యాంకు ను క‌లుపుకుంటే అధికారం ఖాయ‌మ‌ని టీడీపీ భావిస్తోంది.

  • Written By:
  • Updated On - November 2, 2022 / 02:09 PM IST

ఏపీలో కాపు సామాజిక‌వ‌ర్గం కింగ్ మేక‌ర్ అవుతుంద‌ని ప్ర‌ధాన పార్టీల అంచ‌నా. అందుకే ఆ సామాజిక‌వ‌ర్గం మ‌ద్ధ‌తు కోసం ప‌లు ప్ర‌య‌త్నాల‌ను టీడీపీ, వైసీపీ చేస్తున్నాయి. జ‌న‌సేన రూపంలో కాపు సామాజిక‌వ‌ర్గం ఓటు బ్యాంకు వెళ్లిపోతుంద‌ని వైసీపీ ఆందోళ‌న‌. ఆ ఓటు బ్యాంకు ను క‌లుపుకుంటే అధికారం ఖాయ‌మ‌ని టీడీపీ భావిస్తోంది. ఆ క్ర‌మంలో గుర్తింపులేని పార్టీ అయిన‌ప్ప‌టికీ జ‌న‌సేన‌కు ఎన‌లేని ప్రాధాన్యం ఇవ్వ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

గ‌త వారం కాపు సామాజిక‌వ‌ర్గం మంత్రులు రాజ‌మండ్రి కేంద్రంగా కీల‌క స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఆ స‌మావేశం ముగిసిన త‌రువాత జ‌న‌సేన పార్టీని టార్గెట్ చేస్తూ మీడియా ముందు మంత్రులు మాట్లాడారు. చంద్ర‌బాబును సీఎం చేయ‌డానికి జ‌న‌సేనాని తాప‌త్ర‌య ప‌డుతున్నార‌ని చెప్పుకొచ్చారు. సీఎంగా ప‌వ‌న్ ఉంటే ఓకే అంటూ ప‌రోక్షంగా కాపు ఐక్య‌త‌ను ప్ర‌ద‌ర్శించారు. వ్యూహాత్మ‌కంగా కాపు, బ‌లిజ‌, తెల‌గ‌, ఒంట‌రి అంటూ అన్ని కులాల‌ను కాపు సామాజిక‌వ‌ర్గం కింద క‌లిపేశారు. వాస్త‌వంగా కాపు, బ‌లిజ ల‌కు గ్యాప్ ఉంది. ఇక తెల‌గ‌, ఒంట‌రి కులాలు ఎప్పుడూ కాపుల‌తో క‌లిసి న‌డిచే ప‌రిస్థితి లేదు. అంతేకాదు, బ‌లిజ‌, తెల‌గ‌, ఒంట‌రి కులాల‌కు బీసీ రిజ‌ర్వేష‌న్ ప్ర‌స్తుతం కొన‌సాగుతోంది. అదే రిజ‌ర్వేష‌న్ కాపు సామాజిక‌వ‌ర్గం కావాల‌ని డిమాండ్ చేస్తోంది.

Also Read:  TRS MLA’s Quit Please: సార్ ప్లీజ్ రిజైన్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఫోన్ కాల్స్!

కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ ఇవ్వ‌డానికి బ‌లిజ‌, తెల‌గ‌, ఒంటరి కులాలు క‌లిసి వ‌చ్చిన సంద‌ర్భాలు దాదాపుగా లేవు. పైగా జ‌న‌సేనాని ప‌వ‌న్ నికార్సైయిన కాపు కాదంటూ ప‌రోక్షంగా మాజీ మంత్రి పేర్ని నాని ప‌లు సంద‌ర్భాల్లో ఎత్తిచూపే ప్ర‌య‌త్నం చేశారు. గ‌తంలోనూ టాలీవుడ్ వేదిక‌గా స్వ‌ర్గీయ దాస‌రి వ‌ర్సెస్ చిరంజీవి సామాజిక‌వ‌ర్గం వేర్వేర‌ని వివాదం న‌డిచింది. బ‌లిజ‌ల్లోని ఒక తెగగా `మెగా` ఫ్యామిలీ ఉంద‌ని ఆనాడు కొంద‌రు ప్ర‌చారానికి దిగారు. అయితే, కాపు సామాజిక‌వ‌ర్గం గొడుగు కింద‌కు బ‌లిజ‌, తెల‌గ‌, ఒంట‌రి కులాల్ని తీసుకురావ‌డానికి స్వ‌ర్గీయ వంగ‌వీటి రంగా ప్ర‌య‌త్నం చేసి స‌క్సెస్ అయ్యారు. అదే ఫార్ములాను జ‌న‌సేనాని అందుకున్నారు. అందుకే వైసీపీ మంత్రులు దాన్ని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌తిగా టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్ జ్యోతుల నెహ్రూ ఇప్పుడు సీన్లోకి వ‌చ్చారు.

కాపు సామాజికవర్గాన్ని విచ్ఛిన్నం చేయడానికే రాజ‌మండ్రి కేంద్రంగా మంత్రులు సమావేశం అయ్యార‌ని జ్యోతుల విమ‌ర్శించారు. రెచ్చగొట్టేలా కాపు మంత్రులు, ప్రజాప్రతినిధులు వ్యాఖ్యలు ఎందుకు చేశార‌ని నిల‌దీశారు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. వంగవీటి రంగా హత్య కేసులో ప్రధాన నిందితుడు ప్ర‌స్తుతం వైసీపీలోనే ఉన్నాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబును కాపులకు శత్రువుగా చూపే ప్రయత్నం చేయ‌డాన్ని మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. కాపుల‌కు రిజర్వేషన్ ఇచ్చేందుకు చంద్రబాబు ప్రత్యేక కమిషన్ వేసిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిస్తే వైసీపీకి భవిష్యత్తు ఉండదని వ్యూహాత్మ‌కంగా కాపుల‌ను విడ‌దీసే ప్ర‌య‌త్నం మంత్రులు చేస్తున్నార‌ని జ్యోతుల అనుమానం.

Also Read:  TS : హైదరాబాద్ చేరుకున్న కోమటిరెడ్డి… షోకాజ్ నోటిసుపై ఏమంటారో..?

మొత్తం మీద కాపు, బ‌లిజ‌, తెల‌గ‌, ఒంట‌రి కులాల మ‌ధ్య ఉండే వ్య‌త్యాసాన్ని ప్ర‌ధాన పార్టీలు మ‌రిపిస్తున్నారు. అంద‌ర్నీ ఒకే గొడుగు కొంద‌కు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తూ కాపుల రిజ‌ర్వేష‌న్, వంగ‌వీటి రంగా హ‌త్య అంశాల‌ను హైలెట్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఎంత వ‌ర‌కు ఆయా పార్టీల ప్లాన్ స‌క్సెస్ అవుతుందో చూడాలి.