SV Zoological Park : తిరుపతి జూలో వ్యక్తిని చంపేసిన సింహం

తిరుపతి ఎస్వీ జూ (SV Zoological Park)లో విషాదం చోటు చేసుకుంది. ఈరోజు మధ్యాహ్నం జూ సందర్శనకు వచ్చిన రాజస్థాన్ కు చెందిన ప్రహ్లద్ గుర్జార్ సెల్ఫీ కోసం లయన్ ఎన్ క్లోజర్లోకి దూకాడు. అక్కడ సింహాన్ని చూసి తొడగొట్టడం..దానిని రెచ్చగొట్టేలా ప్రవర్తించడం చేసాడు. దీంతో ఆగ్రహం తో సింహం ఒక్కసారిగా అతడిపైకి దూసుకొచ్చింది. తప్పించుకునేందుకు అతడు చెట్టెక్కేందుకు ప్రయత్నించాడు. We’re now on WhatsApp. Click to Join. కానీ సింహం అతడిపై దాడి (Lions […]

Published By: HashtagU Telugu Desk
Lion Kills Man Sv Zoologica

Lion Kills Man Sv Zoologica

తిరుపతి ఎస్వీ జూ (SV Zoological Park)లో విషాదం చోటు చేసుకుంది. ఈరోజు మధ్యాహ్నం జూ సందర్శనకు వచ్చిన రాజస్థాన్ కు చెందిన ప్రహ్లద్ గుర్జార్ సెల్ఫీ కోసం లయన్ ఎన్ క్లోజర్లోకి దూకాడు. అక్కడ సింహాన్ని చూసి తొడగొట్టడం..దానిని రెచ్చగొట్టేలా ప్రవర్తించడం చేసాడు. దీంతో ఆగ్రహం తో సింహం ఒక్కసారిగా అతడిపైకి దూసుకొచ్చింది. తప్పించుకునేందుకు అతడు చెట్టెక్కేందుకు ప్రయత్నించాడు.

We’re now on WhatsApp. Click to Join.

కానీ సింహం అతడిపై దాడి (Lions Kills Man) చేసింది. దీంతో సదరు వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మరణించిన వ్యక్తి జూకు ఒకడే వచ్చినట్లుగా భావిస్తున్నారు. అలాగే మద్యం మత్తులో ఉన్నట్లు జూ సిబ్బంది చెపుతున్నారు. జూ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. చనిపోయిన వ్యక్తి శవాన్ని పోలీసులు రుయా ఆస్పత్రికి తరలించారు. దీనిపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది. గతంలో ఢిల్లీ లో కూడా ఇలాటి ఘటనే చోటుచేసుకుంది. పులి జోన్ లోకి దూకడం తో ఆ వ్యక్తి ఫై దాడి చేసి చంపేసింది.

Read Also : Hyderabad: హైదరాబాద్‌ పాఠశాలల్లో భారీగా ఫీజుల పెంపు

  Last Updated: 15 Feb 2024, 05:19 PM IST