Site icon HashtagU Telugu

TDP : కూటమిలో భాగస్వాములుగా ఉన్న పార్టీల నేతలు క్రమశిక్షణతో ఉండాలి: సీఎం సూచన

Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో కూటమి నేతలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. కూటమిలో భాగస్వాములు గా ఉన్న పార్టీల నేతలు క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీ లేకుండా కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. “లా అండ్ ఆర్డర్” సమస్య సృష్టించేలా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తే ఏ మాత్రం సహించేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.

ఆర్టీపీపీ బూడిద తరలింపు వ్యవహారానికి సంబంధించిన అంశంపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి , టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వెనక్కి తగ్గకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఘనపై స్పందించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించొద్దని హితవు పలికారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కల్పిస్తే సహించను అని.. ఈ ఘటనపై అధికారులు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని సిఎం చంద్రబాబు సూచించారు.

Read Also: TDP MP Kalishetty: టీడీపీ ఎంపీ కలిశెట్టిని అభినందించిన ఏపీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్.. రీజ‌న్ ఇదే!