AP Assembly: రెండో రోజు ఏపి శాసనసభ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంతి అనగాని సత్యప్రసాద్(Anagani Satya Prasad) ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు(Land Titling Act Repeal Bill)ను ప్రవేశపెట్టారు. తాము అధికారంలోకి వస్తే వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని కూటమి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ దిశగా నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ బిల్లు రద్దు చేస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం.
అచ్చమైన తెలుగులో, ఒక్క పదం కూడా ఇంగ్లీష్ వాడకుండా చదివిన సభాపతిని అభినందించిన అసెంబ్లీ సభ్యులు.#APAssembly#AndhraPradesh pic.twitter.com/QcLC6jPisS— Telugu Desam Party (@JaiTDP) July 23, 2024
ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు(Speaker Ayyanna Patra) ఒక్క ఇంగ్లీషు పదం కూడా లేకుండా సభా వ్యవహారాలు నడిపించడం విశేషం. దాంతో ఆయనను సభ్యులందరూ అభినందించారు. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఏమిటంటే..ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య చట్టం రద్దు బిల్లు-2024ను ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదన పట్ల సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి..వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి” అంటూ అయ్యన్నపాత్రుడు పూర్తిగా తెలుగులో మాట్లాడారు.
We’re now on WhatsApp. Click to Join.
అయితే అందరూ అవును అన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ఏకగ్రీవంగా ఆమోదించడమైనది అంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. దీనిపై శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్(Minister Payyavula Keshav)పైకి లేచి… మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో తెలుగులో మాట్లాడి బిల్లును ప్రవేశపెట్టడం హర్షణీయం అని అయ్యన్నపాత్రుడిని అభినందించారు. పైగా, మా అందరికీ ఇష్టమైన బిల్లును తెలుగులో మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు సార్ అంటూ చమత్కరించారు. ఈ రోజు నుంచి మీరొక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు… మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటూ పయ్యావుల పేర్కొన్నారు.
Read Also: Union Budget 2024-25 Highlights : బడ్జెట్ హైలైట్స్