Land Titling Act : కూటమిని గెలిపించబోయేది ‘లాండ్ టైటిలింగ్ యాక్ట్‌నా’..?

ఎంతసేపు సంక్షేమ పథకాల గురించే తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు , రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమలను తీసుకరావడం, ఇలాంటి ఏమి పట్టించుకోలేదు..ఎవరైనా అడిగిన దాడులు..వీటినే ప్రతిపక్ష పార్టీలు టార్గెట్ చేసాయి

Published By: HashtagU Telugu Desk
Nda Alliance Ap

Nda Alliance Ap

ఏపీలో నెల క్రితం వరకు కూడా వైసీపీ (YCP) ప్రభంజనమే కనిపించింది. ఎక్కడ చూడు..ఎవర్ని అడుగు ఒకటే మాట ఈసారి కూడా వైసీపీ విజయం సాదించబోతుందని..జగన్ మళ్లీ సీఎం కాబోతున్నారని 120 నుండి 130 సీట్లు సాదించబోతుందని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు అంత కూటమి ప్రభంజనమే నడుస్తుంది. ఎక్కడ చూడు..ఎవర్ని చూడు..ఏ మాట అంత ఒకటే అంటున్నారు కూటమి (NDA alliance) భారీ విజయం సాదించబోతుందని..చంద్రబాబు సీఎం కాబోతున్నారని..ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాబోతున్నారని. నెల రోజుల్లోనే ఇంత చేంజ్ ఎలా అయ్యిందని వైసీపీ నేతలు తలలు బాదుకుంటున్నారు. దీనికి కారణం చంద్రబాబు..పవన్ కళ్యాణ్ ప్రచార వ్యూహాలే.

We’re now on WhatsApp. Click to Join.

జగన్ మూడు నెలల నుండి అభ్యర్థులను మార్చడం..ఇంటింటి ప్రచారం..ఇలా నానా హడావిడి చేస్తూ వచ్చాడు. అది కాక ఒకే స్క్రిప్ట్ తో అన్ని సభల్లో ఉపన్యాసం ఇవ్వడం..ఇంతసేపు సంక్షేమ పథకాల గురించే తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు , రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమలను తీసుకరావడం, ఇలాంటి ఏమి పట్టించుకోలేదు..ఎవరైనా అడిగిన దాడులు..వీటినే ప్రతిపక్ష పార్టీలు టార్గెట్ చేసాయి. కరెక్ట్ గా ఎన్నికల పోలింగ్ కు నెల రోజుల సమయం ఉంది అనగా..కూటమి తమ ప్రచారాన్ని మొదలుపెట్టాయి. ప్రజల్లోకి ఎలా వెళ్తే బాగుంటుందో..వైసీపీ ఫై ఏ విధంగా విమర్శలు చేస్తే ప్రజలు ఆలోచనలో పడతారో..వాటితో వెళ్లి సక్సెస్ అయ్యింది. గత ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి లేకపోవడం, ఇసుక మాఫియా, కొండలు తవ్వడం , రాజధాని లేకుండా చేయడం , మద్యం , చిత్త పన్ను ఇలా అన్నింటిని జనాల్లోకి తీసుకెళ్లారు. ముఖ్యంగా Land Titling Act దీనిని మరింతగా తీసుకెళ్లారు. ఈ జీవో ద్వారా మీ భూములన్నీ జగన్ వద్దకు వెళ్తాయి..మీ భూములకు ఆయనే యజమాని అవుతారని..మీరు మీ భూమి అమ్మలేరు , తాకట్టు పెట్టలేరు అంటూ జనాల్లో వెళ్లి సక్సెస్ అయ్యారు. కూటమి నేతలు చెప్పే విషయాలతో ఆలోచనలో పడ్డారు. నిజమే కదా వీరు చెప్పేది అంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కేవలం 15 రోజుల్లో రాష్ట్ర గాలి మొత్తం తమ వైపు తిప్పుకున్నారు. నెల క్రితం వరకు వైసీపీ పార్టీనే గెలుస్తుందన్న ప్రజలు..ఇప్పుడు కూటమి భారీ విజయం సాదించబోతుందని..దానికే ఓటు అని తేల్చి చెపుతున్నారు. మరి ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి.

Read Also : Ram Pothineni : మెగాస్టార్ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ తో హరీష్ శంకర్..!

  Last Updated: 10 May 2024, 04:05 PM IST