Lakshmi Parvathi : చంద్రబాబుపై పుస్తకం రాశా.. త్వరలో రిలీజ్.. జూనియర్ ఎన్టీఆర్, పవన్ పై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు..

తాజాగా లక్ష్మి పార్వతి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబుపై అల్లుడు సుద్దులు అని పుస్తకం రాశాను. త్వరలోనే పుస్తకాన్ని రిలీజ్ చేస్తాను.

  • Written By:
  • Publish Date - June 7, 2023 / 09:00 PM IST

దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు(Nandamuri Taraka Ramarao) రెండో భార్యగా లక్ష్మి పార్వతి(Lakshmi Parvathi) అందరికి సుపరిచితమే. ఎన్టీఆర్ మరణం తర్వాత ఆ ఫ్యామిలీకి దూరంగా ఉంటూ, చంద్రబాబు(Chandrababu)కి వ్యతిరేకంగా మారింది. ఇక జగన్(YS Jagan) పార్టీ వచ్చాక అతనితో చేతులు కలిపి కుదిరినప్పుడల్లా చంద్రబాబుపై విమర్శలు చేస్తోంది. తాజాగా లక్ష్మి పార్వతి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

లక్ష్మి పార్వతి మాట్లాడుతూ.. మరోసారి జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయం. కర్ణాటక ఫలితాలు ముందుగా ఇచ్చిన ఇండియా టుడే త్వరలో జగన్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అవుతారని చెప్పింది. చంద్రబాబుపై అల్లుడు సుద్దులు అని పుస్తకం రాశాను. త్వరలోనే పుస్తకాన్ని రిలీజ్ చేస్తాను. ఎన్టీఆర్ స్థాపించిన TDP అవినీతి మయం అయింది కాబట్టే వ్యతిరేకిస్తున్నాను. లోకేష్ చేసేది పాదయాత్ర కాదు ఈవెనింగ్ వాక్. చంద్రబాబు ప్రభుత్వ అక్రమాల వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జాప్యం జరిగింది. వచ్చే ఏడాదికి పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వడం ఖాయం. అమిత్ షాతో కలయిక బీజేపీ, టీడీపీ పొత్తు కోసమే. ఆ కలయిక జరగదని నేను భావిస్తున్నాను. తిరుపతి వచ్చినప్పుడు అమిత్ షాపై రాళ్లు వేసిన చంద్రబాబు ఎలా బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు. చంద్రబాబు వాజ్‌పాయ్ కాలం నుంచి బీజేపీని మోసం చేస్తున్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడంలో చంద్రబాబు, లోకేష్ ఒకటే అని అన్నారు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో బాగా రాణిస్తున్నారు. ఇంకా కొంత కాలం ఆయన అక్కడ ఉంటేనే బాగుంటుంది. ఈ రాజకీయాల్లోకి రాకపోతేనే మంచిది అని అన్నారు.

ఇక పవన్, జనసేనపై మాట్లాడుతూ.. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వారాహి కదులుతుంది. అంత వరకు హైదరాబాద్ లోనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఒక మంచి హీరో, మంచి వ్యక్తి కానీ చంద్రబాబు రాజకీయ ఉచ్చులో పవన్ కళ్యాణ్ చిక్కుకున్నాడు. టీడీపీతో జనసేన పొత్తును ఆ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. సీఎం కానప్పుడు పవన్ కళ్యాణ్ ను జనం, కార్యకర్తలు ఎలా ఆదరిస్తారు. జనసేన పార్టీ సింబల్ కూడా కోల్పోయింది అని సంచలన వ్యాఖ్యలు చేశారు లక్ష్మి పార్వతి.

 

Also Read :  Mission Rayalaseema: రాయలసీమను ఆటోమొబైల్ హబ్ గా మార్చేస్తా: లోకేష్