Srikalahasti : మహిళా అఘోరి ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తి ఆలయం ముందు ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనంగా మారింది. అయితే శ్రీకాళహస్తి ఆలయంలోకి వెళ్ళే ప్రయత్నం చేసిన అఘోరీని స్థానిక సెక్యూరిటీ గార్డులు అడ్డుకోవడంతో కారులో ఉన్న పెట్రోల్ డబ్బా తీసుకుని ఒంటిపై పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేయడంతో స్థానికులు, పోలీసులు అడ్డుకున్నారు. బిందెలతో నీళ్లు కుమ్మరించి అఘోరికి వస్త్రాలు చుట్టారు. ఆలయం లోపలికి వెళ్లడానికి అనుమతించకపోవడం వల్లే అఘోరి ఆత్మహత్యా యత్నం చేసినట్లు తెలుస్తుంది.
కాగా, అఘోరిమాత శ్రీకాళహస్తి ఆలయం లోనికి వెళ్లేందుకు సెక్యూరిటీ గార్డులు అనుమతి ఇవ్వని కారణంగా మనస్తాపానికి గురై వారితో వాగ్వాదానికి దిగింది. సెక్యూరిటీ గార్డులతో విబేధించిన సమయంలో అఘోరీ మాత ఆత్మత్యాగం చెయ్యాలని తన కారులో నుండి పెట్రోల్ క్యాన్ తీసుకొని మీద పోసుకోగా, అక్కడే ఉన్న వారు అడ్డుకుని, నీళ్ళతో ఆమె ఒంటిపై పెట్రోల్ శుభ్రం చేసి ఆమెతో బట్టలు వేసి..కారులో కూర్చోబెట్టారు. అయితే ఆలయ నియమాలు పాటించాలన్న సెక్యూరిటీ ఆలయాన్ని సామాన్య సందర్శకుల మాదిరిగా ఆలయ నియమాలు పాటిస్తూ దర్శించుకుంటే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ ఇలా దిగంబరంగా ఆలయంలోనికి అనుమతించలేమని సెక్యూరిటీ చెప్తున్నారు.
అఘోరీని అడ్డుకున్న సెక్యూరిటీ ..
శ్రీకాళహస్తి ఆలయంలోకి ప్రవేశించాలని చూసిన అఘోరీని ఆలయ సెక్యూరిటీ అడ్డుకున్నారు. దీంతో అఘోరీ తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆమెపై నీటిని పోశారు. అయితే తన కారులో పెట్రోలు ముందుగానే… pic.twitter.com/0R4FEuf51b
— ChotaNews (@ChotaNewsTelugu) November 7, 2024
మరోవైపు అఘోరిమాత మాట్లాడుతూ..ఆ విషయం తనకు చెప్పకుండానే తనను అడ్డుకున్నారని, తాను వైజాగ్ వెళ్లినప్పుడు తాను డ్రెస్ రూల్స్ పాటించానని చెప్పారు. ఇక, పోలీసులు ప్రాణ త్యాగానికి సిద్ధ పడిన అఘోరీని అంబులెన్స్ లో ఆస్పతికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించి, ఆపై ఆమెను శ్రీకాళహస్తి నుండి పంపే ప్రయత్నాలు చేయనున్నారు. మరి ఆత్మత్యాగానికి ప్రయత్నం చేసిన క్రమంలో లేడీ అఘోరీపై శ్రీకాళహస్తి పోలీసులు కేసు నమోదు చేస్తారా? లేదా? చూడాలి.