గత కొద్దీ రోజులుగా మహిళా అఘోరి నాగ సాధు (Naga Sadhu).. ప్రముఖ ఆలయాల్లో నగ్నంగా తిరుగుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. డేంజర్…అఘోరీ…నాగసాదు అని ఎర్రటి అక్షరాలతో రాసి ఉన్న కారులో తిరుగుతూ హల్ చల్ చేస్తుంది. మొన్నటి వరకు తెలంగాణ లో హల్చల్ చేసిన ఏ అఘోరి..ఇప్పుడు ఏపీకి మకాం మార్చింది. నాగుల చవితి సందర్భంగా మంగళవారం ఉదయం జోడిగుడ్లపాలెంలోని నాగ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది.
ఈ సందర్బంగా మీడియా తో మాట్లాడుతూ.. హిందుత్వ పరిరక్షణ, గో సంరక్షణ, మరియు మహిళల రక్షణ కోసం తాను ఎంత దూరమైనా వెళ్తానని , హిమాలయాలకు వస్తే తన శక్తులను చూపిస్తానని తెలిపింది. తనపై ఎన్ని కేసులు పెట్టినా, అవి తనపై ప్రభావం చూపవని పేర్కొంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆయన కుటుంబ సభ్యులకు తన ఆశీస్సులు ఉంటాయని చెప్పి, ఆయన ఆహ్వానిస్తే తప్పక కలుస్తానని వెల్లడించింది.
ఇక సోమవారం విశాఖ జిల్లా నక్కపల్లి టోల్ ప్లాజా వద్ద ఆమెకు కొన్ని అసభ్యకర సంఘటనలు ఎదురయ్యాయని పేర్కొంది. అక్కడ టోల్‌గేట్ సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించింది. ఈ సంఘటనలో ఆమె ధర్మ రక్షణ గురించి తన ఆవేదనను, ప్రస్తుత సమాజం కలియుగంలో ఎలా మారిపోయిందనే తన అభిప్రాయాన్ని తెలిపింది.
Read Also : KTR : ఆటో డ్రైవర్లకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను నెరవేర్చరా ? : కేటీఆర్