Palamaner : వైసీపీ లో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే..

పలమనేరుకు చెందిన టీడీపీ మ్మెల్యే ఎల్ లలిత కుమారి వైసీపీ లో చేరారు. సీఎం జగన్ పలమనేరుకు వచ్చిన సందర్భంగా ఆమె జగన్‌ను కలిసి, ఆయన సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు

  • Written By:
  • Publish Date - May 5, 2024 / 11:56 AM IST

ఏపీలో ఎన్నికలకు ఇంకొన్ని గంటల సమయం మాత్రమే ఉంది..ఈ సమయంలో కూడా వలసల పర్వం కొనసాగుతున్నాయి. పలమనేరు (Palamaner )కు చెందిన టీడీపీ మ్మెల్యే ఎల్ లలిత కుమారి (L Lalitha Kumari) వైసీపీ లో చేరారు. సీఎం జగన్ (Jagan) పలమనేరుకు వచ్చిన సందర్భంగా ఆమె జగన్‌ను కలిసి, ఆయన సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కండువా కప్పి ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు జగన్. 2004 ఎన్నికల్లో ఎల్ లలిత కుమారి టీడీపీ అభ్యర్థిగా పలమనేరు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పట్లో టీడీపీ తరఫున గెలిచిన అతి కొద్దిమంది ఎమ్మెల్యేల్లో ఈమె ఒకరు. దివంగత సీఎం వైస్సార్ ప్రభంజనాన్ని సైతం తట్టుకుని ఆమె విజయం సాధించడం విశేషం.

We’re now on WhatsApp. Click to Join.

2009 ఎన్నికల్లో లలిత కుమారికి కాకుండా మాజీ మంత్రి ఎన్ అమర్‌నాథ్ రెడ్డి కి చంద్రబాబు టికెట్ ఇచ్చారు. ఆ అమర్‌నాథ్ గెలిచినప్పటికీ .. ఆ తర్వాత ఆయన వైసీపీ లో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా నెగ్గారు. మళ్లీ ఆయన సొంతగూటికి చేరారు. 2019లో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో కూడా అమర్‌నాథ్ రెడ్డికే టికెట్ లభించింది. తన సమీప ప్రత్యర్థి, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్ వెంకటే గౌడతో తలపడుతున్నారు. ఇవన్నీ చూసిన లలిత టీడీపీ లో ఉండలేక..వైసీపీ లో చేరారు.

మే 13 న ఏపీలో అసెంబ్లీ తో పాటు పార్లమెంట్ కు సంబదించిన పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ , కూటమి పార్టీలు పనిచేస్తున్నాయి. గత 20 రోజులుగా ఇరు పార్టీల నేతలు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా కూటమి పార్టీల అభ్యర్థుల ప్రచారం జోరుగా నడుస్తుంది. పలు సర్వేలు సైతం ఈసారి మెజార్టీ ప్రజలు కూటమికే మద్దతు ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అటు వైసీపీ సైతం కూటమి దీటుగా ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రజలు పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. అయినప్పటికీ గెలుపు ఫై అధికార పార్టీ నేతలు ధీమా గా ఉన్నారు. మరోసారి జగన్ సీఎం అవుతారని అంటున్నారు. చూద్దాం మరి ప్రజలు ఎవరికీ పట్టం కడతారో ..!!

Read Also : Urvashi Rautela : క్రికెటర్ గురించి హాట్ బ్యూటీ నో కామెంట్ అనేస్తుంది..!