Site icon HashtagU Telugu

Ahmedabad Plane Crash : కూటమి ప్రభుత్వ ఏడాది పాలన సభ వాయిదా

Tollywood problems to come to a head.. Cine elders meet with CM Chandrababu

Tollywood problems to come to a head.. Cine elders meet with CM Chandrababu

అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయోత్సవ సభను వాయిదా వేసింది. కూటమి ప్రభుత్వం (Kutami Govt) ఏడాది పాలనను పురస్కరించుకొని శుక్రవారం జరపాల్సిన ఈ కార్యక్రమాన్ని అహ్మదాబాద్ ఘటన దృష్ట్యా రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజల ప్రాణనష్టం నేపథ్యంలో ఉత్సవాలకు తావు లేదని ప్రభుత్వం భావించింది.

242 People Died: తీవ్ర విషాదం.. విమాన ప్ర‌మాదంలో 242 మంది మృతి

విమాన ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో 242 మంది మృత్యువాతపడినట్లు తెలిసిన వెంటనే ఆయన ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేయాలని ఆదేశించారు. ప్రజల ప్రాణాలు పోయిన సమయంలో ఎలాంటి వేడుకలు నిర్వహించడం తగదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి తదుపరి తేదీలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

Former Gujarat CM Vijay Rupani: కుప్ప‌కూలిన విమానం.. గుజ‌రాత్ మాజీ సీఎం ప‌రిస్థితి ఎలా ఉంది?

లండన్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ మేఘానీనగర్ ప్రాంతంలో కూలిన ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. విమానంలో ఉన్న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందడం బాధాకరం. ఆయన కుమార్తెను కలవడానికి లండన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ విషాదంపై ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.