KTR Conspiracy : థాక్స్ వెనుక కోటానుకోట్ల లాజిక్

ఏపీలోని అధికార‌, ప్ర‌తిప‌క్ష నాయ‌కుల వాల‌కాన్ని వ్యంగ్యాంగా(KTR Conspiracy)చిత్రీక‌రిస్తున్నారు బీఆర్ఎస్ మంత్రులు.

  • Written By:
  • Publish Date - August 8, 2023 / 02:11 PM IST

ఏపీలోని అధికార‌, ప్ర‌తిప‌క్ష నాయ‌కుల వాల‌కాన్ని వ్యంగ్యాంగా(KTR Conspiracy)చిత్రీక‌రిస్తున్నారు బీఆర్ఎస్ మంత్రులు. ప్ర‌త్యేకించి క‌ల్వ‌కుంట్ల కుటుంబం చంద్ర‌బాబు, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఏక‌కాలంలో థాక్స్ చెబుతోంది. దానికి కార‌ణం కోకాపేట భూమి ధ‌ర ఎక‌రా 100 కోట్లు ప‌ల‌క‌డ‌మేన‌ట‌. తెలంగాణ పాల‌న మీద చంద్ర‌బాబు, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌శంస‌లు కురిపించార‌ని అసెంబ్లీ వేదిక‌గా మంత్రి కేటీఆర్ థాక్స్ చెప్ప‌డం గ‌మ‌నార్హం.

తెలంగాణ పాల‌న మీద చంద్ర‌బాబు, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌శంస‌లు(KTR Conspiracy)

వాస్త‌వంగా చంద్ర‌బాబు చెప్పిన‌దాన్ని అనుకూలంగా మంత్రి కేటీఆర్  (KTR Conspiracy) మ‌లుచుకున్నారు. ఒక‌ప్పుడు ఏపీలో ఒక ఎక‌రం అమ్మితే, తెలంగాణాలో 100 ఎక‌రాలు వ‌చ్చేద‌ని గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణ‌లో ఒక ఎక‌రం అమ్ముకుంటే ఏపీలో 100 ఎక‌రాలు వ‌స్తుంద‌ని వ్యాఖ్యానించారు. దానికి కార‌ణంగా తాను చేసిన అభివృద్ధి అంటూ చంద్ర‌బాబు వివ‌రించారు. ఆ రోజున 2020 విజ‌న్ ను చెడ‌గొట్ట‌కుండా కేసీఆర్ అమ‌లు చేస్తున్నార‌ని కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన మాట వాస్త‌వం. కేవ‌లం చంద్ర‌బాబు కృత‌జ్ఞ‌త చెప్పిన మాట‌ను మాత్ర‌మే కేటీఆర్ తీసుకున్నారు. దాన్ని కేసీఆర్ పాల‌న‌కు గీటురాయిగా చెప్పుకోవ‌డం ప్రారంభించారు. కానీ, చంద్ర‌బాబు విజ‌న్ కార‌ణంగా ప్ర‌స్తుతం తెలంగాణ అభివృద్ధి చెందింద‌ని మాత్రం చెప్ప‌డానికి సాహ‌సం చేయ‌డంలేదు. విద్యుత్‌, మంచినీళ్లు, భూముల ధ‌ర‌లు పెర‌గ‌డం…త‌దిత‌రాల‌న్నీ చంద్ర‌బాబు ఇచ్చిన ఫ‌లాలే. వాటిని అనుభ‌విస్తోన్న క‌ల్వ‌కుంట్ల కుటుంబం చంద్ర‌బాబు చేసిన మేల‌ను దాచిపెడుతోంది.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిల వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేస్తూ తెలంగాణ‌లోని విప‌క్షాల‌ను టార్గెట్

తెలంగాణలోని శాంతి భద్రతలను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రెండేళ్ల క్రితం మెచ్చుకున్నారు. దిశ సంఘటన జ‌రిగిన త‌రువాత‌ తెలంగాణ ప్రభుత్వం స్పందించిన తీరును ఏపీ అసెంబ్లీలో కొనియాడారు. ‘ఐ సెల్యూట్ కేసీఆర్స అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు. దాన్ని గుర్తు చేసిన మంత్రి కేటీఆర్ తెలంగాణ అసెంబ్లీలో `ఐ థ్యాంక్స్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి` అంటూ ప్ర‌స్తావించారు. ఇలా అనుకూల అంశాల‌ను  (KTR Conspiracy)ఎన్నిక‌ల ప్ర‌చార అస్త్రాలుగా బీఆర్ఎస్ మ‌లుచుకుంటోంది. అంతేకాదు, ఏపీలోని చంద్ర‌బాబు, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిల వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేస్తూ తెలంగాణ‌లోని విప‌క్షాల‌ను టార్గెట్ చేశారు. ఏపీ నేత‌లు ప్ర‌శంసిస్తుంటే, తెలంగాణ నేత‌ల‌కు కేసీఆర్ చేస్తోన్న మెరుగైన పాల‌న క‌నిపించ‌డంలేదంటూ అసెంబ్లీ వేదిక‌గా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి.

మ‌చిలీప‌ట్నం పోర్ట్ లో వాటా తీసుకోవాల‌ని ఆలోచ‌న

అమ‌రావ‌తి కుప్ప‌కూల‌డంతో హైద‌రాబాద్ భూముల ధ‌ర‌లు పెరిగాయ‌ని క‌ల్వ‌కుంట్ల కుటుంబం హోల్ సేల్ గా చెబుతోన్న మాట‌. ప్ర‌పంచ వ్యాప్తంగా హైద‌రాబాద్ గుర్తింపుకు కార‌ణం అమ‌రావ‌తి ప్రాజెక్టు లేక‌పోవ‌డమ‌ని చెబుతున్నారు. ఆ ప్రాజెక్టును లేకుండా చేసిన ఘ‌న‌త ప‌రోక్షంగా కేసీఆర్ కు ఉంద‌ని ఆల‌స్యంగా వెలుగుచూస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని శ‌త‌విధాల ప్ర‌య‌త్నంచేసి కేసీఆర్ గెలిపించారు. అంతేకాదు, ఏపీలోని ఆస్తుల మీద కూడా క‌న్నేశారు. అక్క‌డి మ‌చిలీప‌ట్నం పోర్ట్ లో వాటా తీసుకోవాల‌ని ఆలోచ‌న చేశారు. హైద‌రాబాద్ లోని ఉమ్మ‌డి ఆస్తుల్లో తొలి రోజుల్లో స‌చివాల‌య భ‌వ‌నాల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇచ్చేశారు. ఆ త‌రువాత ఏపీ రావాల్సిన బ‌కాయిల‌ను రాబ‌ట్ట‌లేని ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ ఉన్నారు. క‌నీసం 5ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా విలువైన ఏపీ ఆస్తులు తెలంగాణ‌లో ఉన్నాయ‌ని అంచ‌నా. వాటిని విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఇవ్వ‌క‌పోయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏమీ అన‌లేని ప‌రిస్థితుల్లో ఉన్నారు. స‌రిగ్గా ఇలాంటి ప‌రిస్థితి కేసీఆర్  (KTR Conspiracy)అండ్ టీమ్ కు అవ‌స‌రం.

Also Read : Minister KTR: వరంగల్ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ సమీక్ష..అధికారులకు కీలక ఆదేశాలు

ఏపీ రాజధాని లేకుండా చేసిన ఘ‌న‌త జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిది మాత్ర‌మే కాదు. దాని వెనుక కేసీఆర్ ప్ర‌మేయం కూడా ఉంద‌ని తాజాగా క‌ల్వ‌కుంట్ల కుటుంబం చేస్తోన్న వ్యంగ్యాస్త్రాల ఆధారంగా చ‌ర్చించుకుంటున్నారు. అమ‌రావతి శంకుస్థాప‌న‌కు కేసీఆర్ హాజ‌ర‌య్యారు. ఆ రోజున మోడీతో పాటు ప‌లువుర్ని చంద్ర‌బాబు ఆహ్వానించారు. ఆ రోజే చంద్ర‌బాబు విజ‌న్ ను గ‌మ‌నించారు కేసీఆర్. ప్ర‌పంచ ప‌టంలో హైద‌రాబాద్ ను నిలిపిన చంద్ర‌బాబు టాలెంట్ కేసీఆర్ కు తెలుసు. పైగా 2014 నుంచి 2019 వ‌ర‌కు రెండు రాష్ట్రాలు పోటీప‌డి ప‌రిశ్ర‌మ‌ల‌ను తీసుకొచ్చుకున్నాయి. ఇప్పుడు వార్ వ‌న్ సైడ్ త‌ర‌హాలో కంపెనీలన్నీ తెలంగాణ‌కు క్యూ క‌డుతున్నాయి. ఇదంతా 2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును అధికారంలోకి రాకుండా చేయ‌డంలో కేసీఆర్ వేసిన ఎత్తుగ‌డ‌. ఆ విష‌యాన్ని టీడీపీ ప్ర‌తి సంద‌ర్భంలోనూ ఏపీ ప్ర‌జ‌ల‌కు తెలియ‌చేస్తోంది.

Also Read : KCR Powder : BRS,BJP సూత్రం ఇంచుమించు ఒక‌టే..!

ఉమ్మ‌డి రాష్ట్రం ఉన్న‌ప్పుడే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆస్తులు హైద‌రాబాద్ లో భారీగా ఉన్నాయ‌ని స‌ర్వ‌త్రా తెలిసిందే. ఆ త‌రువాత ఎనిమిదేళ్ల పాల‌న‌లో క‌ల్వ‌కుంట్ల కుటుంబం పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంకును హైద‌రాబాద్ చుట్టుప‌క్క‌ల స‌మ‌కూర్చుకుంద‌ని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. క‌నీసం ల‌క్ష కోట్ల‌కు త‌గ్గ‌కుండా సంపాద‌న‌, 10వేల ఎక‌రాల ల్యాండ్ బ్యాంక్ ను క‌ల్ల‌కుంట్ల కుటుంబం దోసేసింద‌ని పీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పే మాట‌. అందుకే, ఇద్ద‌రూ ఆస్తుల విలువ‌ల‌ను పెంచుకోవ‌డానికి అమ‌రావతిని వ్యూహాత్మ‌కంగా కూల్చివేశార‌ని ప్ర‌త్య‌ర్థుల అభిప్రాయం. రాబోవు రోజుల్లోనూ కోకాపేట త‌ర‌హా వేలాల ద్వారా హైద‌రాబాద్ భూముల ధ‌ర‌ల‌ను కృత్రిమంగా పెంచుకోవ‌డానికి ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌ని రియ‌ల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయం. ఎన్నిక‌ల స‌మ‌యంలో భూముల ధ‌ర‌ల‌ను పెంచుకోవ‌డం ద్వారా నిధుల‌ను స‌మ‌కూర్చుకోవ‌చ్చ‌ని జ‌గ‌న్, కేసీఆర్ ఆడుతోన్న ఒక ఆట అంటూ ప్ర‌త్య‌ర్థులు ఆరోపిస్తున్నారు. ఇక అమ‌రావ‌తిని భ‌విష్య‌త్ లోనూ బాగుప‌డ‌కుండా మ‌రోసారి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని గెలిపించ‌డానికి కేసీఆర్, మూడోసారి కేసీఆర్ ను సీఎం చేయ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి శ‌త‌విధాలా ప‌ర‌స్ప‌రం స‌హ‌కారం అందించుకుంటార‌ని జ‌గ‌మెరిగిన స‌త్యం.