వైసీపీ పార్టీ (YCP) ఖాళీ పార్టీ అవ్వబోతుందా..? కేవలం జగన్ (Jagan) ఫ్యామిలీ సభ్యులు మాత్రమే పార్టీలో మిగులుతారా..? వైసీపీ లో ఉంటె ప్రజలు ఏమాత్రం క్షమించరాని భావిస్తున్నారా..? రాజకీయ భవిష్యత్ ఉండాలంటే వైసీపీ ని వదలసిందే అని ఫిక్స్ అవుతున్నారా..? అంటే ఈ ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల ముందు నుండి పార్టీ నేతలు జగన్ కు షాక్ ఇస్తూనే ఉన్నారు. మీము ఉండలేం అంటూ ఒకరి తర్వాత ఒకరు బయటకు వస్తున్నారు. ఇప్పటీకే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు , జడ్పీటీసీ , ఎంపీటీసీ , సర్పంచ్ లు ఇలా అంత బయటకు వస్తున్నారు. తాజాగా రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య (R Krishnaiah) సైతం ఫ్యాన్ వదిలేందుకు సిద్దమయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే వైసీపీ నుంచి ఇద్దరు రాజ్యసభ సభ్యులు దూరమయ్యారు. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే వైసిపికి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఇద్దరు ముగ్గురు తప్పించి అంత ఖాళీ అవుతారని ప్రచారం జరిగింది. కానీ ఇద్దరు రాజ్యసభ సభ్యులు మాత్రమే పార్టీ నుంచి దూరమయ్యారు. తాజాగా కృష్ణయ్య వైసీపీ ని వీడి బిజెపి లో చేరాలని భావిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జాతీయస్థాయిలో కృష్ణయ్యకు మంచి పేరు ఉంది. బీసీ సంఘం నేతగా గుర్తింపు ఉంది. అదే గుర్తింపుతో అన్ని రాజకీయ పార్టీలు ఆయనకు గౌరవించాయి. రాజకీయ అవకాశాలను కల్పించాయి. తొలుత తెలంగాణలో టీడీపీ పార్టీ ఏకంగా నాయకత్వం బాధ్యతలను కృష్ణయ్యకు అప్పగించింది. అసెంబ్లీ టికెట్ కూడా కేటాయించింది. ఎమ్మెల్యేగా కూడా ఆయన గెలిచారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి.. కృష్ణయ్యను పిలిచి మరీ రాజ్యసభ స్థానాన్ని కట్టబెట్టింది. ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్ పై అనేక విమర్శలు వచ్చాయి. అయినా సరే పార్టీకి పనికొస్తుందని ఆయన భావించారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో కృష్ణయ్య మైండ్ సెట్ మారినట్లు తెలుస్తోంది. బిజెపిలోకి వస్తే రాజ్యసభ పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం. అందుకే ఆయన త్వరలో బిజెపిలో చేరనున్నట్లు తెలుస్తోంది.
Read Also : Tirumala Laddu Issue : శుద్ధి చేయాల్సింది శ్రీవారి ఆలయాన్ని కాదు.. బాబు నాలుకను – భూమన