Site icon HashtagU Telugu

KRMB Meeting : ముగిసిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ సమావేశం

Krmb Meeting

Krmb Meeting

హైదరాబాద్‌లోని జలసౌధలో ఈరోజు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ (KRMB) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నీటి అవసరాల గురించి చర్చ జరిగింది. రెండు రాష్ట్రాల నీటి అవసరాలను పరిగణనలోకి తీసుకుని, భవిష్యత్తులో నీటి విడుదలలపై నిర్ణయాలు తీసుకోవాలని బోర్డు ప్రయత్నించింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలతోపాటు, మే నెల వరకు నీటి వినియోగంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తమ అభిప్రాయాలను బోర్డుకు తెలిపారు.

Fact Check: నాగ చైతన్య ‘తండేల్’ చూసి సమంత కన్నీళ్లు?

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే వరకు 55 టీఎంసీల నీరు కావాలని, తెలంగాణ ప్రభుత్వం 63 టీఎంసీల నీరు కావాలని KRMB బోర్డుకు తెలియజేశాయి. నీటి పంపిణీపై స్పష్టమైన సమాధానం అందించేందుకు, ప్రస్తుత నీటి నిల్వలు, భవిష్యత్ వర్షపాతం అంచనాలు, నీటి వినియోగ ప్రణాళికలపై బోర్డు సమగ్రంగా సమీక్ష చేపట్టింది. కృష్ణా నదీ జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య గతంలో తలెత్తిన వివాదాలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు చర్చలు జరిగాయి.

MS Dhoni: న‌యా లుక్‌లో ఎంఎస్ ధోనీ.. హీరో లెవెల్ ఎంట్రీ, వీడియో వైర‌ల్‌

కృష్ణా నదీ జలాల పంపిణీపై రాష్ట్రాల మధ్య ఉన్న విభేదాలను సమసిపర్చేందుకు KRMB కీలక పాత్ర పోషిస్తోంది. రెండు రాష్ట్రాలు తమ నీటి అవసరాలను బోర్డుకు తెలియజేయగా, అందుబాటులో ఉన్న జలవనరులను సమానంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బోర్డు పేర్కొంది. సమావేశంలో ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి పాల్గొన్నారు. బోర్డు ఛైర్మన్ అతుల్ జైన్ సమావేశానికి అధ్యక్షత వహించారు.