TDP : రెండు రోజుల్లో టీడీపీలోకి వసంత , లావు కృష్ణదేవరాయలు

  • Written By:
  • Publish Date - February 26, 2024 / 01:29 PM IST

రెండు రోజుల్లో టిడిపి (TDP) పార్టీలో చేరబోతున్నట్లు వైసీపీ MP లావు కృష్ణదేవరాయలు (MP Lavu Krishnadevarayalu), మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ (Mylavaram MLA Krishna Prasad) ప్రకటించారు. గత కొద్దీ రోజులుగా వీరిద్దరూ చంద్రబాబు తో సమావేశాలు జరుపుతూ వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కూడా టీడిపి లో చేరబోతున్నట్లు అంత ఫిక్స్ అయ్యారు. తాజాగా టిడిపి తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన నేపథ్యంలో వీరి చేరిక ఉందా ..లేదా అని అంత మాట్లాడుకుంటున్నారు. దీంతో చేరికపై వీరు క్లారిటీ ఇచ్చారు.

పల్నాడు జిల్లాలో జరిగే చంద్రబాబు బహిరంగ సభలో టీడీపీలో చేరబోతున్నట్లు MP లావు కృష్ణదేవరాయలు తెలిపారు. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా మళ్లీ పోటీ చేస్తానని ప్రకటించారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పల్నాడు అభివృద్ధికి కృషి చేశానని.. మరోసారి అవకాశం ఇస్తే అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తానని అన్నారు. కాగా ఇటీవల ఆయన వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సైతం మరో రెండు రోజుల్లో సైకిల్ ఎక్కబోతున్నట్లు తెలిపారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. మైలవరం టికెట్ ఇస్తామంటూనే చంద్రబాబు, లోకేష్ ను దూషించాలని జగన్ చెప్పారని దానికి నేను సిద్ధంగా లేనని , అందుకే వైసీపీలో ఉండలేకే టీడీపీలో చేరుతున్నట్లు వసంత తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

దేవినేని ఉమతో కలిసి పని చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. మైలవరం సీటుపై టీడీపీ అధిష్టానం రెండు, మూడు రోజుల్లో క్లారిటీ ఇస్తుందని చెప్పారు. తనతో పాటు టీడీపీలోకి వచ్చే వైసీపీ నాయకులు, కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పెత్తనం చేయడం కాదని.. వారి సారథ్యంలోనే తాము కలిసి పని చేస్తామని అన్నారు. ‘ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరం చేశారు. ఉమాతో నాకు వ్యక్తిగత విభేదాలు లేవు. ఇప్పటివరకూ ఉమ, నేను చెరో దారిలో పని చేశాం. ఇప్పుడు ఒకేదారిలో ప్రయాణం చేస్తాం. అవసరమైతే పార్టీ అధిష్టానం సమక్షంలో మాట్లాడి దేవినేని ఉమతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. పార్టీ హైకమాండ్ నియోజకవర్గం ఎవరికి అప్పచెప్పితే దాని ప్రకారం నడుచుకుంటాను. దేవినేని ఉమతో ఇప్పటివరకూ జరిగిన విషయాలపై క్లారిటీ చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. చంద్రబాబు సీఎం కావడానికి ఎవరితో అయినా కలిసి పని చేసేందుకు సిద్ధం.’ అని స్పష్టం చేశారు.

Read Also : Mohan Babu : నా పేరును పొలిటికల్‌గా వాడుకోవద్దు.. మోహన్ బాబు హెచ్చరిక

Follow us