Kondru Sanjay Murthy: భారత ‘కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌‌’గా కొండ్రు సంజయ్‌మూర్తి.. ఎవరు ?

భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ హోదాలో సంజయ్‌మూర్తి(Kondru Sanjay Murthy) గరిష్ఠంగా ఆరేళ్లు కానీ, 65 ఏళ్ల వరకు కానీ కొనసాగే అవకాశం ఉంది.

Published By: HashtagU Telugu Desk
Kondru Sanjay Murthy Cag Andhra Pradesh Ias Officer

Kondru Sanjay Murthy: తెలుగు ఐఏఎస్ అధికారి కొండ్రు సంజయ్‌మూర్తి.. భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్)గా నియమితులయ్యారు. ఈవిషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.  ఇప్పటివరకు ‘కాగ్’‌గా వ్యవహరించిన గిరీశ్‌చంద్ర ముర్ము పదవీకాలం త్వరలోనే ముగియనున్నందున ఆయన స్థానంలో కొండ్రు సంజయ్‌మూర్తికి అవకాశం కల్పించారు.మన దేశానికి 15వ కాగ్‌గా సంజయ్‌మూర్తిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నియమించారు.  కాగ్‌ చీఫ్‌ పదవిలో ఓ తెలుగు వ్యక్తి నియమితులు కావడం ఇదే తొలిసారి. భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ హోదాలో సంజయ్‌మూర్తి(Kondru Sanjay Murthy) గరిష్ఠంగా ఆరేళ్లు కానీ, 65 ఏళ్ల వరకు కానీ కొనసాగే అవకాశం ఉంది.

Also Read :Ram Charan : ఎఆర్‌ రెహ్మాన్‌ కు ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్న రామ్ చ‌ర‌ణ్..

కొండ్రు సంజయ్ మూర్తి ఎవరు?

  • కొండ్రు సంజయ్‌మూర్తి..  ఆంధ్రప్రదేశ్‌ వాస్తవ్యులే. 1964 డిసెంబరు 24న జన్మించారు.
  • ఆయన అమలాపురం మాజీ ఎంపీ కేఎస్‌ఆర్‌ మూర్తి కుమారుడు.
  • కేఎస్ఆర్ మూర్తి 1996లో కాంగ్రెస్ తరఫున అమలాపురం నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు.
  • ఎంపీగా ఎన్నికవడానికి ముందు కేఎస్ఆర్ మూర్తి కూడా ఐఏఎస్ అధికారిగా కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయిలో సేవలు అందించారు.
  • చిరంజీవి కొంతకాలం రాజకీయాల్లో  ఉన్న టైంలో కేఎస్‌ఆర్‌ మూర్తి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అయితే వెంటనే ఆయన ప్రజారాజ్యానికి రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చేశారు.
  • కేఎస్‌ఆర్‌ మూర్తి  హైదరాబాద్‌లో నివసిస్తుంటారు. ఆయన సతీమణి అనసూయా దేవి మూర్తి చనిపోయారు.
  • కేఎస్ఆర్ మూర్తి  కుమారుడు సంజయ్‌మూర్తి మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేశారు.
  • 1989లో ఐఏఎస్‌ అధికారిగా హిమాచల్‌ప్రదేశ్‌ కేడర్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో పని చేస్తున్నారు.
  • 2021 సెప్టెంబరు నుంచి జాతీయ ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
  • కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం అమలులో సంజయ్ కీలక పాత్ర పోషించారు.
  • ఐఏఎస్‌ అధికారిగా డిసెంబరులో సంజయ్ ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. ఈ తరుణంలో ఈ కీలక బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం ఆయనకు అప్పగించింది.

Read :Nayanthara : నయనతార నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. ఏమేం చెప్పారు? ఏమేం చూపించారు?

  Last Updated: 19 Nov 2024, 09:21 AM IST