Site icon HashtagU Telugu

TTD : ప్రముఖ ఆధ్యాత్మిక గాయని, కొండవీటి జ్యోతిర్మయికి టీటీడీలో అరుదైన గౌరవం దక్కబోతుందా..?

Kondaveeti Jyothirmayi

Kondaveeti Jyothirmayi

తెలుగు భాషా సంస్కృతికి, ఆధ్యాత్మిక సంగీతానికి, సామాజిక స్పృహకు సేవలందిస్తూ ముందంజలో నిలిచిన గొప్ప వ్యక్తిత్వం కొండవీటి జ్యోతిర్మయి (Kondaveeti Jyothirmayi). ఆమె కేవలం అన్నమయ్య కీర్తనలు పాడే గాయని మాత్రమే కాదు. జాతీయ స్థాయిలో బ్రైలీ లిపిలో గ్రంథాలను ముద్రించి గిన్నిస్, లిమ్కా రికార్డులు నెలకొల్పిన ఘనత ఆమెకు దక్కింది. కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యం కలిగిన ఈ సంగీత విద్వాంసురాలు, జీవితాన్ని ధర్మబద్ధమైన జీవనశైకి, సమాజసేవకు,సాంస్కృతిక పరిరక్షణ అనే మూడింటి పై పట్టున్నవ్యక్తి. ఆమె చేసిన సేవలు టీటీడీ వంటి సంస్థలకు మేలు చేసే శక్తివంతమైన అనుభవంగా చెప్పుకోవచ్చు.

Tirumala Laddu Controversy : తిరుమల లడ్డూ కల్తీ అంశం.. సుప్రీంకోర్టుకు సిట్‌ నివేదిక

జ్యోతిర్మయి (Kondaveeti Jyothirmayi) జీవన దారిలో తత్త్వశాస్త్రపు లోతు, ఆధ్యాత్మికత, సామాజిక స్పృహ అన్నింటికీ సమన్వయం ఉంది. అన్నమయ్య కీర్తనల ద్వారా భక్తి మాత్రమే కాకుండా, సామాజిక మార్పుకు దోహదపడే సందేశాల్ని విశ్లేషిస్తూ అందరికీ చైతన్యం తీసుకురావడమే ఆమె లక్ష్యం. గ్రామీణ యువతకు అవార్డులు, రైతులకు పాదపూజలు, చేనేత వస్త్రాల పంపిణీ, విద్యార్థులతో ర్యాలీలు, సంకీర్తన కార్యక్రమాలు – ఇలా అన్నీ ఒకే దిశగా నడిపించిన వ్యక్తి. ఆమె మాటల్లోనే కాదు, ప్రవర్తనలోనూ ఆత్మచైతన్యం, సేవారాధన బలంగా కనిపిస్తాయి. “మాట సున్నితం, గానం అమృతం, బాట ఆదర్శం” అన్న వాక్యం ఆమెకు అక్షరాలా సరిపోతుంది.

ఇంతటి గొప్ప వ్యక్తి(Kondaveeti Jyothirmayi)ని టీటీడీ తమ సేవలకు గాను ఉపయోగించుకుంటే కేవలం ఆమెకు ఒక గౌరవం మాత్రమే కాదు – అది ధర్మాచరణకు దిశా నిర్దేశం కావచ్చు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆమెకు అవకాశం ఇవ్వడం అంటే వేల గ్రామాలకు ఆధ్యాత్మిక సంస్కృతి, సేవా తరంగాల్ని పంపడం లాంటిది. ఆమె వైఖరి, సేవా దృక్పథం, ప్రజలలో మానవతా స్ఫూర్తిని రగిలించే శక్తి గా మారుతుందని, ఇవన్నీ టీటీడీ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం టీటీడీ బోర్డులో జ్యోతిర్మయి వంటి మానవతావాదులకు అవకాశం కల్పించటం ద్వారా దైవ సేవకు సేవా ధర్మాన్ని జతచేసే విధంగా ఉంటుందని, అంతే కాదు ప్రతిపక్ష పార్టీల విమర్శలకు , ఆరోపణలకు కూడా చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారు.

ప్రజలు, ప్రముఖులు, కళా సంస్కృతుల వర్గాలు ఆమె సేవలను గుర్తించి టీటీడీ సేవలో ఆమెకి స్థానం ఇవ్వాలని అంత కోరుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఇదే ఆలోచన చేస్తుందని ఇప్పటికే ఆ పనుల్లో మునిగి ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దాం ప్రభుత్వం ఆమెను గుర్తిస్తుందో లేదో..!!