AP Special Status : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని డిమాండ్ చేసిన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి

ఢిల్లీ (Delhi) పర్యటనలో ఉన్న తెలంగాణ రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (MInister Komatireddy Venkat Reddy)..ఏపీకి ప్రత్యేక హోదా (AP Special Status) ఇవ్వాలి అని దానికోసం కృషి చేస్తానని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదాపై ప్రధాని హోదాలో మన్మోహన్‌సింగ్‌ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అలాగే దేశ రాజధానిలో తెలంగాణ భవన్ (Telangana Bhavan ) లేకపోవడం విచారకరమన్నారు. We’re now on WhatsApp. Click to […]

Published By: HashtagU Telugu Desk
Komatireddy Venkat Reddy De

Komatireddy Venkat Reddy De

ఢిల్లీ (Delhi) పర్యటనలో ఉన్న తెలంగాణ రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (MInister Komatireddy Venkat Reddy)..ఏపీకి ప్రత్యేక హోదా (AP Special Status) ఇవ్వాలి అని దానికోసం కృషి చేస్తానని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదాపై ప్రధాని హోదాలో మన్మోహన్‌సింగ్‌ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అలాగే దేశ రాజధానిలో తెలంగాణ భవన్ (Telangana Bhavan ) లేకపోవడం విచారకరమన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తి కావస్తున్నా తెలంగాణ భవన్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ భవన్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ముఖ్యమంత్రితో చర్చిస్తానన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తుల వివరాలను సీఎంకు వివరిస్తానన్నారు. ఇక రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు కావస్తున్నా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రత్యేక హోదాకు తన మద్దతు ఉంటుందని అందుకు తన వంతుగా కృషి చేస్తానన్నారు.

Read Also : CPI Narayana : ఏపీలో జగన్ ఓడిపోవడం ఖాయం – నారాయణ

  Last Updated: 12 Dec 2023, 03:15 PM IST