ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani)పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో ప్రజలను దోచుకున్న నాని, ఇప్పుడు ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2023లో బదిలీ అయిన తహశీల్దార్ 2024లో పట్టాలు ఎలా ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే పేదల కోసం నిర్మించిన 6400 టిడ్కో ఇళ్లు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. సీఆర్డీజెడ్ భూముల్లో పట్టాలు ఇవ్వడాన్ని కోర్టులే తప్పుపట్టిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై పేర్ని నాని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.
Metro : మెట్రో రైలు ట్రాక్ కాంక్రీట్ బీమ్ కూలడంతో వ్యక్తి మృతి
పేర్ని నాని సానుభూతి రాజకీయాలకు ఇక శరమగీతం పడే రోజులు వచ్చాయని, అవినీతి కేసుల నుంచి తప్పించుకునేందుకు అర్థరాత్రి హైకోర్టును ఆశ్రయించడమే దీనికి నిదర్శనమని కొల్లు రవీంద్ర విమర్శించారు. బియ్యం బస్తాల కుంభకోణం, ఇళ్ల స్థలాల పేరుతో అధిక ధరలకు భూములు కొనుగోలు చేయించి కమిషన్లు పొందడం వంటి అక్రమాల్లో నాని పాత్ర ఉందని ఆరోపించారు. ప్రజలు నానిని అవినీతి మచ్చ గా చూస్తున్నారని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.
Viral : విమానం కాలిపోయిన..చెక్కు చెదరని భగవద్గీత!
బందరు నకిలీ పట్టాల వ్యవహారంలో పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టుపై పోలీసులు క్రిమినల్ కేసుల దాఖలుకు సిద్ధమవుతున్న తరుణంలో నాని మచిలీపట్నంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలతో హఠాత్తుగా సమావేశం నిర్వహించడంపై రాజకీయంగా చర్చ మొదలైంది. తనకు, తన కుమారుడికి నకిలీ పట్టాల వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదంటూ పేర్ని నాని హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఇదంతా చూస్తే.. బందరులో రాజకీయ ఆరోపణలు, న్యాయపరమైన ప్రక్రియలు ఒక్కదాన్ని ఒక్కటి ఛేదిస్తూ సాగుతున్న వైనం తలచుకోదగ్గది.