Site icon HashtagU Telugu

Kolikapudi Srinivasa Rao : ఆందోళనకు దిగిన కూటమి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

Kolikapudi Srinivasa Rao Pr

Kolikapudi Srinivasa Rao Pr

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasa Rao) రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కూటమి పార్టీ అధికారం చేపట్టిన తర్వాత వైసీపీ నేతల అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. అక్రమంగా నిర్మించిన వైసీపీ పార్టీ ఆఫీస్ లనే కాదు ఆయా నేతల నిర్మాణాలను సైతం కూల్చడం..నోటీసులు జారీ చేయడం చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో

We’re now on WhatsApp. Click to Join.

ఎన్టీఆర్ జిల్లా కంభంపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీపీ భర్త కాలసాని చెన్నారావు నిర్మిస్తున్న భవనం అక్రమం అంటూ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నేరుగా ఆందోళనకు దిగారు. ఆ భవనాన్ని కూల్చివేయాలని ఆయన డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించారు. మరో వైపు ఎంపీపీ అనుచరులు, వైసీపీ శ్రేణులు బిల్డింగ్ కూల్చివేయవద్దంటూ భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొడుతున్నారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఉదృతంగా ఉంది. అసలు నోటీసు ఇవ్వన్నీ భవనాన్ని కూల్చివేయడం ఏంటి అని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. కూటమి సర్కార్ కావాలనే వైసీపీ నేతలను టార్గెట్ చేస్తుందని వారంతా వాపోతున్నారు.

Read Also : Gudem Mahipal Reddy : ఈడీ విచారణకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే