Site icon HashtagU Telugu

AP : రేవంత్ కు తుంటి ఏమీ విరగలేదు కదా? జగన్ ఆయనను పరామర్శించడానికి – కొడాలి నాని

Kodali Nani

Kodali Nani

వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని (Kodali Nani)..తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) ఫై ఘాటైన వ్యాఖ్యలు చేసారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) ఫోన్ చెయ్యలేదని, కనీసం విషెస్ కూడా తెలపలేదని కాంగ్రెస్ నేతల ఫై కామెంట్స్ ఫై కొడాలి నాని రియాక్ట్ అయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

రేవంత్ రెడ్డి అభినందనలు తెలుపుతూ ట్విట్టర్ లో పెట్టారు. ఫోన్ చేసి అభినందకపోతే ఏమైంది? కేసీఆర్ కి తుంటి విరిగింది కాబట్టి ఆయనను జగన్ పరామర్శించారు. రేవంత్ రెడ్డికి తుంటి ఏమీ విరగలేదు కదా? జగన్ ఆయనను పరామర్శించడానికి. రేవంత్ రెడ్డి అపాయింట్ మాకు అవసరం లేదు. రేవంత్ రెడ్డిది ఏమైనా ప్రాంతీయ పార్టీనా? రేవంత్ రెడ్డి ఏమైనా సుప్రీమా? అని ప్రశ్నించారు. అంతే కాదు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రుల అపాయింట్ మెంట్లు మాకు అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి గెలిచినప్పుడు సీఎం జగన్ ట్వీట్ చేశారు కదా.. మళ్లీ ఫోన్ చేసి అభినందించాలా..? అని ప్రశ్నించారు.

మేము ఏమైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్నామా? తెలంగాణలో కూర్చుని పని చేయటానికి? కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సీఎం జగన్ ది ఏమైనా కాంగ్రెస్ లో పార్టీనా? తెలంగాణలో ఏ పార్టీకి మద్దతు తెలపలేదు. అక్కడున్న పార్టీని కూడా తీసేసి ఏపీకి వచ్చేశాము. వైసీపీని ఆంధ్రప్రదేశ్ కే పరిమితం చేశాం. తెలంగాణలో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? అన్నది మాకు సంబంధం లేని విషయం. జగన్ ఎగబడరు, దూరంగా ఉండరు. ఆయన లిమిట్స్ లో ఆయన ఉంటారు అంటూ నాని జగన్ కు సపోర్ట్ గా మాట్లాడుతూ రేవంత్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.

Read Also : YCP 3rd List : వైసీపీ థర్డ్ లిస్ట్ లో ఉండేది ఎవరో..ఊడేది ఎవరో..?