కొడాలి నాని (Kodali Nani)..పరిచయం అవసరం లేని నేత. ఈయన్ను బూతుల నేతగా కూడా చాలామంది అంటుంటారు. టీడీపీ పార్టీ నుండి రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగిన ఈయన..ఆ తర్వాత వైసీపీ లో చేరారు. గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుండి ఎమ్మెల్యే గా గెలిచి..మంత్రిగా కూడా కొంతకాలం పనిచేసారు. ఇక అధికారం మా చేతులో ఉందనే గర్వంతో ఇష్టమొచ్చినట్లు మాట్లడడం..అవతలి వ్యక్తులపై బూతులు తిట్టడం వంటివి ఈయనకు కేరాఫ్ గా మారింది. ఆ బూతులే ఈరోజు ఆయన్ను ఇంటికి పరిమితం చేసాయి. గుడివాడ (Gudivada) లో వరుసగా గెలుస్తూ వస్తున్న ఈయనకు ఈసారి ఓటర్లు గట్టి బుద్ది చెప్పారు. ఇక అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ కూడా నానికి వరుస షాకులు ఇస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
వరుసగా కేసులు నమోదు చేస్తూ ఉక్కిరి బిక్కరిని చేస్తుంది. దీంతో మనోడు సైలెంట్ అయ్యాడు. ఇదే క్రమంలో కొంతకాలం రాజకీయాలకు దూరం గా ఉండాలని భావించాడు. ఇదే విషయాన్ని జగన్ (Jagan) కు చెప్పగా..అలాంటి పని..ఇలాంటి పరిస్థితిలో చెయ్యొద్దు..నీకు నేనున్నా..పార్టీ ఉంది. ఏం భయపడకు. త్వరలోనే నేను ప్రజల్లోకి వెళ్తున్న..నీలాంటి నాయకుడు నాకు అవసరం. నువ్వు రాజకీయాల్లోనే కొనసాగు..అని ధైర్యం చెప్పారట. జగన్ తో భేటీ తరువాత జిల్లాలో కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్లాలని కొడాలి నాని నిర్ణయించారు. ఈ మేరకు పేర్ని నానితోనూ చర్చలు చేసారు. పార్టీ పరంగానూ కార్యక్రమాలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారట. మొత్తం మీద జగన్ సూచనతో నాని తన నిర్ణయాన్ని మార్చుకున్నాడని అంత మాట్లాడుకుంటున్నారు.
Read Also : Bharateeyudu 2 Business : కమల్ భారతీయుడు 2 బిజినెస్ ఎంత జరిగిందో తెలుసా..?