AP : సచివాలయం తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో ఉందా ? – కొడాలి నాని

  • Written By:
  • Publish Date - March 4, 2024 / 05:06 PM IST

సీఎం జగన్ (CM Jagan) రాష్ట్ర సచివాలయాన్ని (AP Secretariat) రూ.370 కోట్లకు తాకట్టు పెట్టారంటూ టీడీపీ (TDP) పెద్ద ఎత్తున ఆరోపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అడ్డగోలుగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన జగన్..చివరికి రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టుకు రాసిచ్చి రూ.370 కోట్ల అప్పు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణంలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన భవన సముదాయాన్ని కూడా అప్పుల కోసం వాడుకున్నారు. రాష్ట్ర బడ్జెట్‌ రూ.2.86 లక్షల కోట్లు. కానీ, కేవలం రూ.370 కోట్ల కోసం తాకట్టు పెట్టారని మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఈ ఆరోపణలను CRDA ఖండించింది. ‘ఇదంతా పూర్తి అవాస్తవం అని, సాధారణ పరిపాలన శాఖ నుంచి దీనిపై మాకు ఎలాంటి ప్రతిపాదన రాలేదు. కన్సార్టియం బ్యాంకులు, హడ్కోల నుంచి CRDA పొందిన రుణం మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించాం. సచివాలయం తాకట్టు పెట్టినట్లు వచ్చిన వార్త అవాస్తవం అని తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join.

కానీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మాత్రం సచివాలయం తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో ఉందా ? అని ప్రశ్నించారు. ఆస్తులు తాకట్టు పెట్టకుండా..బ్యాంకులు ప్రభుత్వానికి లోన్ ఇస్తుందా..? ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకూడదని dr అంబేద్కర్ రాజ్యాంగంలో రాశారా..? అని నాని ప్రశ్నించారు. అలాగే ఏపీలో రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందంటూ ప్రశాంత్‌ కిషోర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

ఐప్యాక్ నుంచి తరిమేస్తే బీహార్ లో రాజకీయ పార్టీ పెట్టి దివాళా తీశాడన్నారు. చంద్రబాబు వంటి పనికిమాలిన వ్యక్తుల దగ్గర ప్యాకేజీ తీసుకుని జోతిష్యాలు చెబుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీకే చెప్తే రెండు, మూడు శాతం ఓట్లు మారతాయని చంద్రబాబు ఆశ అన్నారు. కేసీఆర్ గెలుస్తాడని గతంలో పీకే చెప్పాడు, రాజస్తాన్ లో కాంగ్రెస్ పార్టీ థంపింగ్ మెజార్టీతో వస్తుందనీ చెప్పాడన్నారు. చత్తీస్ ఘడ్ లోనూ కాంగ్రెస్ మళ్లీ గెలుస్తుందని చెప్పాడని గుర్తుచేశారు. ఈ మూడు నాలుగు నెలల్లోనే ఈ జాతకాలు చెప్పి విఫలమయ్యాడన్నారు. పీకే వంటి వారిని డబ్బులు తీసుకుని సర్వేలు చేయకుండా పిచ్చివాగుడు వాగుతున్నాడన్నారు. ఇతని పనికిరాని వ్యక్తుల మాటలు జనం పట్టించుకోరని కొడాలి తెలిపారు.జగన్ గతంలో వచ్చిన 151 కంటే ఎక్కువ సీట్లతో అధికారంలోకి వస్తారన్నారు.

Read Also : Ooru Peru Bhairavakona OTT: ఊరి పేరు భైరవకోన ఓటీటీ డేట్ ఫిక్స్.. విడుదలై నెలరోజులు కూడా కాకముందే?