Site icon HashtagU Telugu

Vallabhaneni Vamsi : కిడ్నాప్ కేసు.. వల్లభనేని వంశీ అరెస్ట్‌

Kidnapping case.. Vallabhaneni Vamsi arrested

Kidnapping case.. Vallabhaneni Vamsi arrested

Vallabhaneni Vamsi : వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ రాయదుర్గంలోని మైహోం భుజాలో పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేసి విజయవాడకు తీసుకెళ్లారు. కిడ్నాప్‌, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 140(1), 308, 351(3), రెడ్‌విత్‌ 3(5) కింద వంశీపై కేసు నమోదు చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ ఏ71గా ఉన్నారు. వంశీని గచ్చిబౌలి నుంచి విజయవాడ తరలిస్తున్న ఏపీ పోలీసులు.. అతని ఇంటికి నోటీసులు అంటించారు.

Read Also: Anti Sikh Riots : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు.. ఎవరీ సజ్జన్ కుమార్ ? అసలేం జరిగింది ?

అయితే టీడీపీ కార్యాలయంలో పని చేస్తున్న సత్యవర్థన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ నెల 20న వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రానుంది. వల్లభనేని వంశీ మరికొన్ని కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నారు. ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నం కేసు, గన్నవరం మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కాసరనేని రంగబాబుపై దాడి కేసు, హనుమాన్ జంక్షన్‌లో నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లో వంశీ నిందితుడిగా ఉన్నారు. బాపులపాడు మండలం ఆరుగొలనులో టీడీపీ నాయకుడు వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులో ఏ2గా ఉన్నారు.

కాగా, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్ధన్‌ ఇటీవల విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరై తనకు ఈ కేసుతో సంబంధం లేదంటూ అఫిడవిట్ సమర్పించారు. ఆ తర్వాత టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తనను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజయవాడ అదనపు డీసీపీ కృష్ణ, సిబ్బంది హైదరాబాద్‌ చేరుకుని వంశీని అరెస్ట్‌ చేశారు. మరోవైపు వంశీని అరెస్ట్‌ చేస్తున్నట్లు ఆయన భార్యకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.

Read Also: First Dalit CM : దేశంలోనే తొలి దళిత సీఎం మన ‘సంజీవయ్య’.. జీవిత విశేషాలు