ఆంధ్రప్రదేశ్(AP Govt)లో పాఠశాలల నిర్వహణపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించనుంది. విద్యార్థుల హాజరు తగ్గకుండా చూసేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా విద్యార్థి 3 రోజులకు మించి స్కూల్‌కు హాజరుకాలేకపోతే, వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించింది. దీనిద్వారా విద్యార్థుల నిర్లక్ష్యాన్ని తగ్గించేందుకు, తల్లిదండ్రుల్లో బాధ్యత పెంచేందుకు తీసుకున్న నిర్ణయంగా చెబుతోంది.
Dalai Lama: దలైలామా పునర్జన్మపై వివాదం మళ్లీ తెరపైకి
అంతేకాకుండా, 5 రోజులకుపైగా స్కూల్‌కు రాని విద్యార్థుల విషయాన్ని MEOలు (మండల విద్యాధికారులు), CRPలు (క్లస్టర్ రిసోర్స్ పర్సన్‌లు) వ్యక్తిగతంగా వారి ఇళ్లకు వెళ్లి పరిశీలించాలని ఆదేశించింది. ఈ మేరకు విద్యార్థుల హాజరుపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలని స్పష్టం చేసింది. విద్యార్థుల చదువులో నిర్లక్ష్యం లేకుండా, వీలైనంత త్వరగా స్కూల్‌కు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది.
అకడమిక్ పర్యవేక్షణ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో టీచర్ల హాజరుపైనా దృష్టి సారించింది. ఉపాధ్యాయులు సెలవు తీసుకుంటే, వెంటనే ప్రత్యామాయక ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలని ఆదేశాలు ఇచ్చింది. విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. హాజరుపై కఠిన పర్యవేక్షణతో బడి వార్షిక ప్రణాళికను విజయవంతంగా అమలు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది.