AP Pension: ఏపీలోని పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త

మే నెల పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక సూచనలు ఇచ్చింది. మే 1వ తేదీన పెన్షనర్ల ఖాతాలోకి డబ్బు జమ అవుతుందని జగన్ ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్‌లో మాదిరిగానే మే నెలలో కూడా సచివాలయాల చుట్టూ తిరగకుండానే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్‌ సొమ్మును జమ చేయనున్నారు

AP Pension: మే నెల పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక సూచనలు ఇచ్చింది. మే 1వ తేదీన పెన్షనర్ల ఖాతాలోకి డబ్బు జమ అవుతుందని జగన్ ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్‌లో మాదిరిగానే మే నెలలో కూడా సచివాలయాల చుట్టూ తిరగకుండానే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్‌ సొమ్మును జమ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ పింఛన్ పంపిణీపై పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బ్యాంకు ఖాతా లేని వారికి, వికలాంగులకు ఇంటి వద్దకే పింఛన్‌ డబ్బులు అందజేస్తామన్నారు.

We’re now on WhatsAppClick to Join

రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల మంది వైఎస్ఆర్ ఆసరా కింద పింఛన్లు పొందుతున్నారు. ఇందులో దాదాపు 48 లక్షల 92 వేల మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. వీరందరికీ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. ఖాతాలు లేని వారు, వికలాంగులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి నేరుగా వారి ఇళ్ల వద్దకే పింఛన్‌ అందజేయనున్నారు. మే 1వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు సచివాలయ ఉద్యోగులు వారి ఇళ్ల వద్దకే పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.. నిజానికి మార్చి నెల వరకు వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ జరిగింది. అయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పింఛన్ల పంపిణీ వాలంటీర్ల ద్వారా జరగకూడదని కమిషన్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పంపిణీలో మార్పులు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది

ప్రభుత్వ నిర్ణయంపై పింఛనుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో సచివాలయాల చుట్టూ తిరగే బాధ తప్పిందని ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారు.

Also Read: Ram Parasuram : పరశురామ్ కి ఆఫర్ ఇస్తున్న ఇస్మార్ట్ హీరో.. డబుల్ ఇస్మార్ట్ తర్వాత అతనితోనే ఫిక్స్..!