Site icon HashtagU Telugu

Lay Out : లే ఔట్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Key decision of AP government on layout

Key decision of AP government on layout

Lay Out : భవన నిర్మాణాలు, లేఔట్ల అనుమతుల నిబంధనలు సులభతరం చేస్తూ ప్రభుత్వం GOలు తెచ్చింది. లేఔట్లలో రోడ్లను 12M బదులు 9Mలకు కుదిస్తూ, 500చ.మీ. పైబడిన స్థలాల్లోని నిర్మాణాల్లో సెల్లార్‌కు అనుమతి, TDR బాండ్ల జారీ కమిటీలో సబ్ రిజిస్ట్రార్లను తొలగిస్తూ నిర్ణయించింది. సంక్రాంతి కానుకగా బిల్డర్లు, డెవలపర్లు, ప్రజలకు అనుకూలంగా జీవోలు తెచ్చామని.. దీంతో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందని మంత్రి నారాయణ చెప్పారు.

లే అవుట్లలో రోడ్లకు గ‌తంలో ఉన్న12 మీటర్లకు బ‌దులు 9 మీట‌ర్లకు కుదించారు. 500 చ‌.మీ. పైబ‌డిన స్థలాలు, నిర్మాణాల్లో ఇక నుంచి సెల్లారుకు అనుమ‌తి ఇస్తారు. అలాగే రాష్ట్ర, జాతీయ ర‌హ‌దారిని ఆనుకుని ఉన్న స్థలాలు డెవ‌ల‌ప్ చేసేందుకు 12 మీ.స‌ర్వీస్ రోడ్డు ఏర్పాటు నిబంధ‌న కూడా తొలగించారు. టీడీఆర్ బాండ్ల జారీ క‌మిటీలో రెవెన్యూ, స‌బ్ రిజిస్ట్రార్‌లు తొల‌గిస్తూ జీవో జారీ చేశారు. బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాల సెట్ బ్యాక్ నిబంధ‌న‌ల్లో కూడా మార్పులు చేశారు. వీటితో పాటు మరిన్ని నిబంధనలు సులభం చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది.

తాజా ఉత్తర్వులతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం వేగం పుంజుకోనుందని ప్రభుత్వం నమ్మకంతో ఉంది. ఈ రూల్స్ మార్పు రియల్ఎస్టేట్ వ్యాపారులకూ అనుకూలంగా ఉంటుంది. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వతా ప్రజల ఆస్తుల విలువల్ని పెంచడానికి.. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందడానికి విస్తృత చర్యలు చేపట్టింది. రియల్ ఎస్టేట్ అసోసియేషన్‌ల ప్రతినిధులతో చర్చించి తుది నిబంధనలు జారీ చేశారు.

Read Also: Robin Uthappa: యువ‌రాజ్‌ను జ‌ట్టు నుంచి త‌ప్పించింది కోహ్లీనే.. ఉత‌ప్ప సంచ‌ల‌నం!