Site icon HashtagU Telugu

Kunki Elephants : ఏపీ-కర్ణాటక మధ్య కీలక ఒప్పందాలు: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

Key agreements between AP-Karnataka: Deputy CM Pawan Kalyan

Key agreements between AP-Karnataka: Deputy CM Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. కుంకీ ఏనుగుల అంశంపై ఏపీ-కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, కర్ణాటక మంత్రి ఈశ్వర్‌ ఖండ్రే సమక్షంలో ఇరు రాష్ట్రాల అటవీశాఖ అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.
ఏపీ – కర్ణాటక రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. కర్ణాటక నుంచి 8 ఏనుగులను ఏపీకి పంపే అంశంపై ఒప్పందం జరిగింది. దీనికి కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత కొన్నేళ్లుగా అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో ఏనుగుల ద్వారా అక్కడి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురువుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

Read Also: Harsha Sai : హర్షసాయి వల్ల ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి – కో ప్రొడ్యూసర్

ఈ భేటీలో అనంతరం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ మాట్లాడుతూ.. చిత్తూరు, మన్యం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో పంటపొలాల పై ఏనుగుల దాడి అంశాలు మా దృష్టికి మీడియా తీసుకొచ్చింది.. పంటపొలాల పై ఏనుగుల దాడి అంశంలో కర్ణాటక నుంచి సహాయం అందుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు.. రెండు రాష్ట్రాల మధ్య దేశంలోనే ఇలాంటి ఎంఓయూ గతంలో జరగలేదు పవన్‌ కల్యాణ్.. ఏపీ, కర్ణాటక మధ్య 8 అంశాలపై ఒక కీలక నిర్ణయం తీసుకున్నాం అని వెల్లడించారు..

కాగా, గత కొన్నేళ్లుగా చిత్తూరు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో ఏనుగులు జనావాసాల్లోకి ఎక్కువగా ప్రవేశిస్తున్నాయి. అయితే విజయనగరం వంటి మన్యం ప్రాంతాల్లో ఏనుగుల బీభత్సం కారణంగా పలు సందర్భంల్లో రైతులు, ప్రజలు ప్రాణాలు విడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో ఏనుగుల కారణంగా ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవలే బెంగళూరు వెళ్లి కర్ణాటక మంత్రి ఈశ్వర్‌ ఖండ్రే, అక్కడి అధికారులతో చర్చించారు. కుంకీ ఏనుగులను పంపాలని ప్రతిపాదించగా వారు సానుకూలంగా స్పందించారు. దీనికి సంబంధించిన ఒప్పందం నేడు జరిగింది.

Read Also: Jagan : తిరుమలకు జగన్ రాక..ఏంజరుగుతుందో టెన్షన్..?

కుంకీ ఏనుగులంటే.. మావటిలు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చిన ఏనుగులు. అడవి ఏనుగులను ఎలా తరిమేయాలో.. వాటిని ఎలా మచ్చిక చేసుకుని అడవిలోకి పంపించాలో.. ఆగ్రహంతో ఉన్న గజరాజులను ఎలా శాంతింపజేయాలో.. ఇలా అన్ని రకాలుగా వాటికి ట్రైనింగ్ ఇస్తారు. అంటే అడవి ఏనుగులను క్యాప్చర్ చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. కేరళ, గౌహతి ప్రాంతాల్లో వీటికి శిక్షణ ఉంటుంది. వీటిని చిన్నప్పటి నుంచి మావటిలు జాగ్రత్తగా పెంచుతారు. ఏ సందర్భంలో ఎలా నడుచుకోవాలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు.

Read Also: Saif Ali Khan : ఆయన ఎంతో ధైర్యవంతుడైన రాజకీయ నాయకుడు: సైఫ్‌ అలీఖాన్‌