విజయవాడ 11వ డివిజన్ టీడీపీ కార్పోరేటర్ కేశినేని శ్వేత రాజీనామా చేశారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మీకి తన రాజీనామా లేఖను అందజేశారు.తన రాజీనామా ఆమోందించాక టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఆమె తెలిపారు.తాము ఎప్పుడూ టీడీపీని విడాలి అనుకోలేదని..టీడీపీ పార్టీ మమల్ని వద్దు అనుకునప్పుడు తాము పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని భావిస్తున్నామన్నారు. కేశినేని నాని పార్టీకి రాజీనామా చేసాక కార్యకర్తలతో మాట్లాడి భవిషత్ కార్యాచరణ ప్రకటిస్తారని ఆమె తెలిపారు. జగన్ ప్రభుత్వం వచ్చాక కార్పొరేటర్ ల ప్రాణాలకు రిస్క్ అని తెలిసి కూడా ఎన్నికల్లో పోటీ చేశారని తెలిపారు. గౌరవం లేని చోట తాము పని చేయలేమని తెలిపారు. కేశినేని నాని కానీ తాను కానీ ప్రజల తరుపున పోరాటం చేస్తామని.. గత సంవత్సరం కలం నుంచి టీడీపీ పార్టీలో కేశినేని నాని అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
విజయవాడ చుట్టూ పక్కన ఉన్న ఒక్క పార్లమెంట్ లో కూడా టీడీపీకి అభ్యర్థి లేరని.. విజయవాడ పార్లమెంటు కి అభ్యర్థి ఉంటే ఇక్కడ ఎందుకు పార్టీ మార్చాల్సి వస్తుందని ఆమె ప్రశ్నించారు. కృష్ణాజిల్లా లో జరుగుతున్న విషయాలు ఇప్పటి వరకూ టీడీపీయ అధిష్టానానికి తెలియదు అనే భ్రమలో ఉన్నామని… మున్సిపల్ ఎన్నికలప్పుడు విజయవాడ లో ముగ్గురు నాయకులు మమ్మల్ని ఇబ్బంది పెట్టారని.. ఇంతవరకు అధిష్టానం వారిని పిలిచి మందలించలేదన్నారు. పార్టీ ఇప్పటికైన మేలుకోవాలని.. ఎందుకు జిల్లాలో పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందో అధిష్టానం ఆలోచించుకోవాలన్నారు.మూడోసారి ఎంపీగా కేశినేని నాని పార్లమెంట్‌లో అడుగుపెడతారని తెలిపారు. విజయవాడ ప్రజల కోసం ఆయన పని చేస్తారని తెలిపారు. మాజీ మంత్రి ఆలపాటి రాజా, కొనకళ్ల నారాయణ, నెట్టెం రఘురామ్‌లతో లోకేష్ అన్న వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయన్నారు. నాని అన్న ఎందుకు ఈ కార్యక్రమాల్లో జోక్యం చేసుకుంటున్నారని లోకేష్ అన్నారని తెలిపారని ఆమె చెప్పారు. సిట్టింగ్ ఎంపీకి పార్టీలో గౌరవం లేదని అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నామన్నరు.
Also Read: Chandrababu Vs Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ వల్ల చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవా..?