Site icon HashtagU Telugu

Kesineni Nani Meets Jagan : టీడీపీ కోసం రూ.2 వేల కోట్ల ఆస్తులు అమ్ముకున్న – కేశినేని నాని

Jagan Nani

Jagan Nani

విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani )..కొద్దీ సేపటి క్రితం సీఎం జగన్ (Jagan) ను కలిశారు. రీసెంట్ గా నాని టీడీపీకి రాజీనామా (TDP Resign) చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయన పయనం ఎటువైపు అనే అంశంపై అందరిలో ఆసక్తికి నెలకొంది. ఈ తరుణంలో కేశినేని నాని..నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. నాని అలాగే తన కుమార్తె కేశినేని శ్వేతతో కలిసి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. వారిరువురు సీఎం జగన్ తో సమావేశమై పలు అంశాలపై చర్చ జరిపారు. తండ్రి బాటలోనే విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్ కేశినేని శ్వేత టీడీపీకి గుడ్ బై చెప్పడం జరిగింది.

జగన్ ను కలిసిన అనంతరం నాని మాట్లాడుతూ..టీడీపీ కోసం రూ.2 వేల కోట్ల ఆస్తులు అమ్ముకున్నానని చెప్పుకొచ్చారు. TDPలో శక్తికి మించి కష్టపడ్డా. అన్ని కార్యక్రమాలు నా సొంత డబ్బులతో నిర్వహించా. TDP కోసం డబ్బు, సమయం వృథా చేసుకున్నా. ఆ పార్టీ కోసం వ్యాపారాలు మానుకున్నా. కానీ ఆ పార్టీ నన్ను అవమానించింది’ అని పేర్కొన్నారు. ఇన్ని రోజులు టీడీపీ కోసం, ప్రజల కోసం ఎంతో చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పచ్చి మోసగాడు అని కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

టీడీపీలో ఇంక అవమానాలు భరించలేకనే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. సొంత పార్టీ నేతల నుంచి ఎన్ని అవమనాలు ఎదురైనా తట్టుకుని నిలబడ్డానని, చంద్రబాబు పచ్చి మోసగాడు అని ప్రపంచానికి తెలుసు, కానీ ఈ స్థాయిలో మోసం చేస్తాడని ఊహించలేదన్నారు. రాబిన్ శర్మ టీమ్ మన పార్టీకి ఎన్నికల్లో 5 కంటే ఎక్కువ సీట్లు రావని చెప్పారని.. కానీ ఆ రిపోర్ట్ బయటకు రావొద్దని తనకు సూచించినట్లు కేశినేని నాని వెల్లడించారు. ఓ వ్యక్తితో ప్రెస్ మీట్ పెట్టించి తనను ఉద్దేశపూర్వకంగానే తిట్టించారంటూ మండిపడ్డారు. చెప్పుతో నన్ను కొడతారని ఆ వ్యక్తి తీవ్ర వ్యాఖ్యలు చేస్తే సైతం పార్టీ నుంచి కనీసం స్పందన లేదన్నారు.

ఇక విజయవాడలోని కేశినేని భవన్ వద్ద టీడీపీ జెండాలను, చంద్రబాబు ఫొటోలను వారు కొన్నిరోజుల కిందటే తొలగించారు. చంద్రబాబు తిరువూరు రా కదలి రా సభతో కేశినేని సోదరుల మధ్య వివాదం రేగింది. ఇరు వర్గాలు కొట్లాటకు దిగడంతో హై టెన్షన్ వాతావరణం కనిపించింది. ఈ గొడవ జరిగిన ఒకటి రెండు రోజుల్లోనే కేశినేని నాని తన ఎంపీ పదవికి రాజీనామా చేసి, టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఆయన కుమార్తె కేశినేని శ్వేత కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. ఒకవేళ కేశినేని నాని వైసీపీలో చేరితే విజయవాడ రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారనున్నాయి.

Read Also : Congress – Ayodhya : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్లం : కాంగ్రెస్