Site icon HashtagU Telugu

Kavach In AP : ఆంధ్రప్రదేశ్‌‌లోని రైల్వే రూట్లకు రూ.2,104 కోట్ల రక్షణ ‘కవచం’

Kavach Automatic Train Protection System Ap Railway Lines

Kavach In AP : కవచ్‌ వ్యవస్థ.. రైలు మార్గాల్లో ప్రమాదాలు జరగకుండా నివారిస్తుంది. రెడ్‌ సిగ్నల్‌ను పట్టించుకోకుండా లోకో పైలట్‌ రైలును నడిపితే, కవచ్  వ్యవస్థ అతడిని అలర్ట్ చేస్తుంది. బ్రేక్‌లను తన నియంత్రణలోకి తెచ్చుకొని ప్రమాదాలు జరగకుండా అడ్డుకుంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిధిలోని మూడు కీలక రైలు మార్గాల్లో కవచ్‌ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. దువ్వాడ – విజయవాడ, విజయవాడ – గూడూరు, మంత్రాలయం రోడ్‌ – రేణిగుంట రైలు మార్గాల్లో ఈ రక్షణ ‘కవచం’  అందుబాటులోకి రానుంది. దీంతోపాటు ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ విధానాన్ని ఈ రూట్లలో ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల రైళ్లను(Kavach In AP) మధ్యలో ఆపడం, ప్రధాన రైల్వే స్టేషన్ల సమీపంలోహాల్టింగ్‌లో ఉంచడం వంటి సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి. దీనివల్ల ప్రయాణికుల సమయం ఆదా అవుతుంది.

Also Read :Brutal Murder : ఆభరణాల కోసం పొరుగింటి మహిళ మర్డర్.. నెల్లూరులో దారుణం

Also Read :US Election Results : అమెరికా ఎన్నికల ఫలితాలు.. ట్రంప్ 198 Vs కమల 109