తమిళ నటి, బీజేపీ తమిళనాడు మహిళా నాయకురాలు కస్తూరి (Kasturi) చేసిన లేటెస్ట్ కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నాయి.తాజాగా బీజేపీ (BJP)సమావేశంలోఆమె మాట్లాడుతూ.. రాజీలు, మహరాజుల కాలంలో తెలుగువారు.. అంతఃపురంలో మహిళలకు సేవకులుగా పనిచేసేందుకు తమిళనాడుకు వచ్చారని చెప్పడం పై యావత్ తెలుగు ప్రజలు , రాజకీయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేఫథ్యంలో బీజేపీ నేత, తమిళనాడు సహా ఇన్ చార్జి పొంగులేటి సుధాకర్ (Ponguleti Sudhakar Reddy) స్పందించారు. కస్తూరి వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. కస్తూరి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. ఆమె ఆ వ్యాఖ్యలను ఎందుకు చేశారో యధాలాపంగా అన్నారా లేక మరెవరైనా ఆమెతో అలా చెప్పించారా అనేది తెలియాల్సి ఉందన్నారు.
అయితే తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేసారు కస్తూరి. తెలుగువారిని తాను అవమానించలేదని, తెలుగు తన మెట్టినిల్లని చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. తెలుగువారంతా తన కుటుంబమని, తనపై ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తారన్నారు. తన వ్యాఖ్యల్ని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. తమిళ మీడియాలో తన కామెంట్స్ ను వక్రీకరిస్తూ వస్తున్న వార్తల్ని ఎవరూ నమ్మొద్దని కోరారు.
Read Also : Beauty Tips: పచ్చి పాలతో మెరిసిపోయే చర్మాన్ని సొంతం చేసుకోండిలా!