నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) తెలుగుదేశం పార్టీ (TDP) జెండా పట్టుకోవడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తన తాజా చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి (ArjunSonOfVyjayanthi) ప్రమోషన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన కళ్యాణ్ రామ్ కు నరసరావుపేటలో భారీ స్వాగతం పలికారు. అభిమానులు, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకొని కేరింతలు కొట్టడంతో, నిజమైన ఉత్సవ వాతావరణం కనిపించింది. ఈ క్రమంలోనే ఓ పార్టీ కార్యకర్త అందించిన పసుపు జెండాను కళ్యాణ్ రామ్ పట్టుకుని ఊపడంతో, ఆయన టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారా? అనే చర్చ మొదలైంది.
Bank Holiday: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. రేపు బ్యాంకులకు హాలిడే ఉందా?
ఈ సంఘటన నందమూరి , నారా కుటుంబాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయనే అంశంపై కొత్త చర్చకు దారి తీసింది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు అరెస్టైనప్పుడు, నందమూరి కుటుంబంలోని చాలా మంది స్పందించినప్పటికీ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు మౌనం పాటించారని కొన్ని వర్గాలు విమర్శించాయి. అయితే ఇప్పుడు కళ్యాణ్ రామ్ పార్టీ జెండా పట్టుకోవడం, టీడీపీ శ్రేణులకు అభివాదం చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇకపోతే నరసరావుపేటలో పెద్ద ఎత్తున అభిమానులు కళ్యాణ్ రామ్‌కు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం గమనార్హం.
ఈ ఫ్లెక్సీల్లో నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లతో పాటు నారా లోకేష్ ఫోటోలు కూడా ఉండటం విశేషం. ఇది టీడీపీలో నందమూరి కుటుంబం ఐక్యంగా ఉందని ప్రదర్శిస్తున్నట్లు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. గతంలో నారా లోకేష్ కూడా నందమూరి కుటుంబంతో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో కళ్యాణ్ రామ్ టీడీపీ జెండా పట్టుకోవడం ఆయన భవిష్యత్తు రాజకీయ ప్రస్థానం పై కొత్త ఊహాగానాలకు దారి తీసింది. ఈ ఘటన నందమూరి అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పొచ్చు.
పిలిచి మరి #టీడీపీ జెండా తీసుకున్న Nandamuri Kalyanram అన్న 💛
తాతగారు స్థాపించిన పార్టీని మర్చిపోతారా #నందమూరి కుటుంబం!💥💥💥@NANDAMURIKALYAN #ArjunSonOfVyjayanthi pic.twitter.com/F5JGibvYn5— sk khasmalli (@khasmalli) March 31, 2025