Site icon HashtagU Telugu

Nandamuri Kalyan Ram: రాజకీయ వర్గాల్లో కాకా రేపుతున్న కళ్యాణ్ రామ్ కామెంట్స్

Nandamuri Kalyan Ram

Nandamuri Kalyan Ram

Nandamuri Kalyan Ram: కళ్యాణ్‌ రామ్ ఇప్పుడు డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నెల 29న డెవిల్ మూవీ రిలీజ్ కానుంది. టీజర్ అండ్ ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉండడంతో డెవిల్ పై అందరిలో ఆసక్తి ఏర్పడింది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన కళ్యాణ్‌ రామ్ రాజకీయాల గురించి చెప్పిన సమాధానం సంచలనం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ఈసారి ఎన్నికలు మరింత రసవత్తరంగా జరగనున్నాయి. ఈసారి మీరు ఎటు వైపు ఉండబోతున్నారు అనే ప్రశ్నకు కుటుంబం మొత్తం ఆలోచించుకుని.. తర్వాత అందరికీ చెబుతాం అన్నారు. కుటుంబం అంటే.. ఎన్టీఆర్, మీరే కదా అంటే.. అవును మేమిద్దరమే మిగిలాం అన్నారు.

కళ్యాణ్‌ రామ్ చెప్పిన ఈ సమాధానమే సంచలనం అయ్యింది. కారణం ఏంటంటే.. మీరు ఎటు వైపు అని అడిగిన ప్రశ్నకు తెలుగు దేశం పార్టీ మా తాత పెట్టిన పార్టీ.. ఆ పార్టీ వైపే ఉంటామని చెప్పచ్చు. అలా అనకుండా కుటుంబం అంతా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం అని చెప్పడం కాస్త షాకింగ్ గా ఉంది. దీంతో కళ్యాణ్ రామ్ కామెంట్స్ అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సినీ వర్గాల్లోనూ హాట్ టాపిక్ అయ్యింది. ఎన్నికల టైమ్ కి నిజంగానే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. మా నిర్ణయం ఇది.. ఈ పార్టీకి మా మద్దతు అని చెబుతారా..? లేదా సైలెంట్ గా ఉంటారా..? అనేది ఆసక్తిగా మారింది. మరి.. ఎన్టీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

బింబిసారా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు నందమూరి హీరో కళ్యాణ్‌ రామ్. నిర్మాతగా, హీరోగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ బ్యానర్లో ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Also Read: COVID-19 News Cases: దేశంలో 24 గంటల్లో 529 కొత్త కోవిడ్ కేసులు నమోదు