Kalyan Ram : రాబోయే ఎన్నికల్లో సపోర్ట్ ఎవరికీ అనేదానిపై కళ్యాణ్ రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

  • Written By:
  • Publish Date - December 26, 2023 / 10:03 PM IST

ఏపీ (AP)లో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి రాష్ట్ర ప్రజలు ఎవరికీ పట్టం కట్టబోతారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. తెలంగాణ ప్రజలు రెండుసార్లు విజయం సాధించిన బిఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ కు పట్టం కట్టగా..ఏపీ ప్రజలు మరో ఛాన్స్ వైసీపీ (YCP) కి ఇస్తారా..లేక టిడిపి (TDP) – జనసేన (Janasena) ఉమ్మడి ఓటు వేస్తారనేది అంత చర్చించుకుంటున్నారు. ఈ తరుణంలో ఎన్నికల్లో మీ సపోర్ట్ ఎవరికీ అనే ప్రశ్నకు నందమూరి కళ్యాణ్ రామ్ ఆసక్తికర సమాదానాలు ఇచ్చారు.

గత కొద్దీ కాలంగా రాజకీయాలకు కళ్యాణ్ రామ్ (Kalyan Ram) , ఎన్టీఆర్ (NTR) దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. నందమూరి ఫ్యామిలీ ఫంక్షన్లకు సైతం పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. ఇరువురు సినిమాలపై దృష్టి సారించి సినిమాలు చేసుకుంటూ రాజకీయాలను పూర్తిగా పట్టించుకోకుండా గడిపేస్తున్నారు. తాజాగా కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ (Devil) మూవీ ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పీరియాడికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్తా మీనన్ కథానాయికగా నటిస్తోంది. సత్య, మాళవిక నాయర్, ఎడ్వర్డ్ సొన్నెన్‌బ్లిక్.. ఇతర కీలక పాత్రలను పోషించారు. అభిషేక్ నామా దర్శకుడు. కాగా సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతుండడం తో చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్ కార్య క్రమాలతో బిజీ బిజీ గా గడుపుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్భంగా ఓ వెబ్‌సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాల గురించి మాట్లాడారు. ఏపీలో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇస్తారంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు కల్యాణ్ రామ్ సమాదానాలు ఇచ్చారు. రాజకీయాలకు సంబంధించిన అంశం కావడం వల్ల సమాధానం ఇవ్వడానికి కొద్దిసేపు తడబడ్డారు. ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనేది తన ఒక్కడి నిర్ణయం మీద ఆధారపడి ఉండదని ,. కుటుంబం అంతా కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. తాను గానీ, జూనియర్ ఎన్టీఆర్ గానీ వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోలేమని , నాన్న లేకపోవడం వల్ల తామే కుటుంబ పెద్దగా ఉంటోన్నామని, తాను, తారక్ ఇద్దరం దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని కల్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యలు విన్న వారంతా టిడిపి కి సపోర్ట్ చేస్తారా..? లేదా అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

Read Also : Eggs in Winter Season: శీతాకాలంలో గుడ్డు తినడం మంచిదేనా.. గుడ్డు తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా?