Site icon HashtagU Telugu

Nara Lokesh Congratulates Team: క‌ల్కి సినిమాపై మంత్రి నారా లోకేష్ ట్వీట్‌.. ఏమ‌న్నారంటే..?

Nara Lokesh Congratulates Team

Nara Lokesh Congratulates Team

Nara Lokesh Congratulates Team: ‘క‌ల్కి 2898AD’ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో ఏపీ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ (Nara Lokesh Congratulates Team) చేశారు. కల్కి సినిమా గురించి అద్భుతమైన రివ్యూస్ వినడం చాలా ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాలోని నటీనటులందరికీ కంగ్రాట్యులేషన్స్. భార‌తీయ సినిమాని మ‌రో మెట్టు ఎక్కించే విధంగా ఈ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్‌‌కి ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ సినిమాలో నటించిన ప్ర‌భాస్‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్‌, దీపికా ప‌దుకొణెకు కూడా మంత్రి లోకేష్ ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు. ముఖ్యంగా ఇలాంటి సినిమా తీసిన నిర్మాత అశ్వనీ దత్ గారికి స్వ‌ప్న‌, ప్రియాంక‌ల‌కు కూడా నా అభినంద‌నలు అని నారా లోకేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇక‌పోతే పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా డెరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌కత్వంలో ఈరోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సినిమా కల్కి 2898AD. ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యాన‌ర్‌పై అశ్వ‌నీద‌త్ దాదాపు రూ.600 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. ప్ర‌భాస్‌తో పాటు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని, శోభన, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. ప్ర‌స్తుతం ఈ మూవీ సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. మ‌రోవైపు తెలుగు రాష్ట్రాల్లోని ఇరు ప్ర‌భుత్వాలు సినిమా టికెట్ల రేట్ల పెంపుకు అనుమతిచ్చిన విష‌యం తెలిసిందే.

Also Read: Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ముందు ఓవరాక్షన్ చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది..!!

మ‌రోవైపు ఈ సినిమా చూసిన టాలీవుడ్ పెద్ద‌లు, రాజ‌కీయ ప్ర‌ముఖులు మూవీపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. ప్ర‌త్యేకంగా ప్ర‌భాస్ అభిమానులు ఇరు రాష్ట్రాల వ్యాప్తంగా విజ‌యోత్స‌వ సంబరాలు జ‌రుపుతున్నారు. ఎక్స్‌లో సైతం ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలు ఇస్తూ సినిమాపై మ‌రింత హైప్ పెంచుతున్నారు ప్రేక్ష‌కులు. ఇక వీకెండ్ మొద‌లు కావ‌డంతో ఈ మూవీ గ‌త చిత్రాల రికార్డుల‌ను సైతం కొల్ల‌గొట్టే అవ‌కాశముంద‌ని సినీ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

We’re now on WhatsApp : Click to Join