Kakinada Port : జగన్ మాఫియా పై..ప్రజా ఉద్యమం పెల్లుబకాల్సిన అవసరం..?

Kakinada Port : అరబిందో కంపెనీ పేరుతో జగన్ మాఫియా రూ.6,000 కోట్ల విలువైన ఆస్తులను కేవలం రూ.506 కోట్లకే రాయించుకోవడం పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు

Published By: HashtagU Telugu Desk
Kakindaport

Kakindaport

కాకినాడ పోర్టు ఆస్తుల (Kakinada Port Assets) అన్యాక్రాంతం వ్యవహారంపై పెద్ద దుమారం రేగుతోంది. అరబిందో కంపెనీ (Aurobindo Company) పేరుతో జగన్ మాఫియా రూ.6,000 కోట్ల విలువైన ఆస్తులను కేవలం రూ.506 కోట్లకే రాయించుకోవడం పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఆస్తి దోపిడీకి పాల్పడిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ప్రజా ఉద్యమం పెల్లుబకాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. జగన్ మాఫియా, వారి అనుచరులు కాకినాడ సెజ్ మరియు డీప్ వాటర్ పోర్టు ఆస్తులపై కన్నేశారు. సెజ్‌లో భాగస్వాములైన కె.వి.రావు, జి.ఎం.ఆర్.లపై బెదిరింపులు చేసి, తప్పుడు ఆడిట్ రిపోర్టులతో ఆస్తులను అరబిందోకు రాయించుకున్నారు. వీటిని దొరక్కపోతే ఇతర కాంట్రాక్టులను రద్దు చేస్తామని బెదిరించారు. ఈ క్రమంలో విశ్వసనీయమైన పారిశ్రామిక వాతావరణం దెబ్బతింది.

కాగా, సీ.ఐ.డి. దర్యాప్తు చేపట్టిన ఈ కేసులో ముందడుగు వేయాలని ప్రజలు ఆశిస్తున్నారు. కేవలం రాజకీయ ముసుగులోని కొందరు వ్యక్తుల ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని ఉపయోగించడం అన్యాయమని, దీనివల్ల సామాన్యుల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్యాయానికి గట్టిగా ఎదురొడ్డి నిలబడాలని నిపుణులు సూచిస్తున్నారు. కాకినాడ పోర్టు వివాదం కారణంగా పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. దీని వల్ల నిరుద్యోగం మరింత పెరుగుతోంది. ప్రభుత్వ అనుమతితో పెద్ద మొత్తంలో పేదల బియ్యం అక్రమ రవాణా కూడా జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనల వల్ల రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడి పోతుందని విమర్శలు ఉధృతమవుతున్నాయి.

ప్రజలు ఈ వ్యవహారంపై చైతన్యంతో ముందుకు రావాలి. రాజకీయ ముసుగులో జరుగుతున్న ఈ దోపిడీని అడ్డుకోవాలని, ఆస్తుల రక్షణ కోసం ఉద్యమం చేయాలని విజ్ఞులు అంటున్నారు. ఇది కేవలం కాకినాడ పోర్టు సమస్య మాత్రమే కాదు, అన్ని ఆస్తుల రక్షణకై జరిగే పోరాటమని ప్రజలు అంటున్నారు.

Read Also : ISRO PSLV C-59: పీఎస్ఎల్వీ సి-59 ప్రయోగం వాయిదా… ప్రోబ-3 లో సాంకేతిక లోపం!

  Last Updated: 04 Dec 2024, 05:14 PM IST