AP : టీడీపీ, జనసేన నాయకులను కొనాలని చూస్తున్న వైసీపీ – జనసేన అభ్యర్థి ఉదయ్

అధికార పార్టీ అసమ్మతి నేతలను తమ వైపు తిప్పుకోవాలని..అవసరమైతే భారీ డబ్బు ఆశ చూపు వారిని వారి పార్టీలో చేరుకోవాలని చూస్తుందని ప్రస్తుతం రాష్ట్రం లో ప్రచారం జరుగుతుంది

Published By: HashtagU Telugu Desk
Uday

Uday

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఈసారి కూటమి పొత్తులో భాగంగా చాలామంది నేతలకు టికెట్స్ దక్కలేదు. దీంతో టికెట్ దక్కని నేతలు ఆయా పార్టీ అధిష్టానాలు ఫై కాస్త ఆగ్రహంగా ఉన్నారు. దీంతో అధినేతలు వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తూ..దగ్గర చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ అసమ్మతి నేతలను తమ వైపు తిప్పుకోవాలని..అవసరమైతే భారీ డబ్బు ఆశ చూపు వారిని వారి పార్టీలో చేరుకోవాలని చూస్తుందని ప్రస్తుతం రాష్ట్రం లో ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం ఫై కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి ఉదయ్ (Uday Srinivas) స్పందించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ప్రచారంలో నిజం ఉందని..అధికార దాహంతో వైసీపీ (YCP) నేతలు టీడీపీ, జనసేన (Janasena) నాయకులను కొనాలని చూస్తున్నారని ఉదయ్ ఆరోపించారు. అంతే కాదు పార్టీ లో వర్గ విభేదాలు తలెత్తినట్లు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. వారంతా ప్రచారం చేసిన కాకినాడలో ఎలాంటి వర్గ విభేదాలు లేవని తామంతా కలిసే ఉన్నామని , పార్టీ విజయం కోసం కష్టపడుతున్నామని తెలిపారు. అధికార పార్టీ నేతలు ఎంత చేసిన విజయం తమదే అని ధీమా వ్యక్తం చేసారు. ఇక వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ కుమార్ అక్రమ మైనింగ్‌కు సునీల్ కింగ్‌పిన్ అని ఆరోపించారు. 2019 నుంచి రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నా కాకినాడను సునీల్ కుమార్ ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు.

Read Also : BRS Party: కార్యకర్తల అక్రమ కేసుల పై డీజీపీకి బీఆర్ఎస్ ఫిర్యాదు

  Last Updated: 17 Apr 2024, 05:20 PM IST