నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారా..? ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాగే మాట్లాడుకుంటున్నారు. ఇటీవల జరిగిన రుస్తుం మైనింగ్ కేసు(Mining Case)లో ఆయన ఏ-4గా ఉన్నారు. ఈ కేసులో మిగతా ముగ్గురిని ఇప్పటికే అరెస్టు చేయగా, కాకాణి కూడా నేడో రేపో అరెస్టు అవుతారని ప్రచారం జరుగుతోంది. దీనితో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, విచారణ వాయిదా పడిందని సమాచారం. ముందస్తు బెయిల్ లభించే వరకు ఆజ్ఞాతంలో ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.
SVSN వర్మ..వైసీపీ తో టచ్ లో ఉన్నాడా..? ముద్రగడ కూతురి షాకింగ్ కామెంట్స్
ఇలా ఆజ్ఞాతంలోకి వెళ్లడం కాకాణి గోవర్ధన్ రెడ్డి కి మొదటిసారి కాదు, గతంలో నకిలీ మద్యం కేసు, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై తప్పుడు సర్టిఫికేట్లు తయారు చేయించిన కేసుల్లోనూ ఆయన ఇలాగే ఆజ్ఞాతంలోకి వెళ్లిన రికార్డు ఉంది. అప్పట్లోనూ అరెస్టు భయంతో గల్లంతైన ఆయన, న్యాయపరమైన అవకాశాలను సద్వినియోగం చేసుకుని బెయిల్ వచ్చాక బయటకు వచ్చారు. ఇప్పుడు కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనతో వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీ నాయకత్వం ఈ వ్యవహారంపై ఇంకా స్పందించలేదు. కాకాణి పరారయినట్లు వార్తలు వస్తుండటంతో వైసీపీకి రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడూ ప్రభుత్వాన్ని అడ్డంగా వాడుకున్న నాయకులు, ఇప్పుడు అరెస్టు భయంతో తప్పించుకోవడం సమంజసం కాదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ వచ్చే వరకూ ఆయన ఆజ్ఞాతంలోనే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.