Sharmila Politics: షర్మిలతో కాంగ్రెస్ ఫ్రెండ్షిప్ పై పాల్ హాట్ కామెంట్స్

తెలంగాణాలో వైఎస్ఆర్టీపి పార్టీ నెలకొల్పిన వైఎస్ షర్మిల అధికార పార్టీపై ఎప్పటికప్పుడు విరుచుకుపడుతుంది. సీఎం కేసీఆర్ పాలనను తీవ్రంగా వ్యతిరేకించే షర్మిల

Sharmila Politics: తెలంగాణాలో వైఎస్ఆర్టీపి పార్టీ నెలకొల్పిన వైఎస్ షర్మిల అధికార పార్టీపై ఎప్పటికప్పుడు విరుచుకుపడుతుంది. సీఎం కేసీఆర్ పాలనను తీవ్రంగా వ్యతిరేకించే షర్మిల త్వరలో తెలంగాణ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోనున్నట్టు గత కొద్దీ రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య షర్మిల ప్రియాంక గాంధీతో సంప్రదింపులు జరిపినట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే షర్మిల పొత్తు అనే విషయాన్ని పక్కనపెట్టేసి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా ఢిల్లీ కాంగ్రెస్ ఆలోచిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్ కుటుంబానికి ఆదరణ ఉంది. గతంలో వైఎస్ చేసిన అభివృద్ధి పనులను ప్రజలు ఇంకా మరిచిపోలేదు. ఈ క్రమంలో వైఎస్ఆర్ ఓటు బ్యాంక్ చెక్కు చెదరలేదనేది కాంగ్రెస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో షర్మిలను ఉపయోగించుకుని తెలంగాణ రాజకీయాల్లో సత్తా చాటాలన్నది కాంగ్రెస్ హైకామండ్ యోచిస్తుంది. ఇదిలా ఉండగా షర్మిలను ఏపీ రాజకీయాల్లోకి తీసుకురావాలన్నది కూడా కాంగ్రెస్ ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

తాజాగా కేఏ పాల్ వైఎస్ షర్మిలపై, కాంగ్రెస్ పై చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ లో షర్మిల పార్టీని విలీనం చేయనున్నట్టు తేల్చి చెప్పారు పాల్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… షర్మిల భర్త అనిల్‍కు కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసి మాట్లాడినట్టు ఆరోపించారు పాల్. జులై 8న వైఎస్ జన్మదినం సందర్భంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇడుపులపాయకు వచ్చి వైఎస్సార్‍కు నివాళులర్పించనున్నారని, ఈ క్రమంలో కాంగ్రెస్ పెద్దలు వైఎస్ విజయమ్మతో చర్చలు జరపనున్నారని అన్నారు కేఏ పాల్.

రాహుల్ గాంధీని వైఎస్సార్ ప్రధానిగా చూడాలనుకున్నారని కేఏ పాల్ అన్నారు. ఈ మేరకు తండ్రి కోరిక నెరవేర్చేందుకు కాంగ్రెస్ వైపు షర్మిల అడుగులు వేయనున్నట్టు ఆరోపించారు ఆయన. దానికి తోడుగా నిన్న రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల రాహుల్ కు విశేష్ తెలిపిన విషయాన్ని నొక్కి చెప్పాడు కేఏ పాల్.

వైఎస్ఆర్ కుటుంబంపై సంచలన ఆరోపణలు గుప్పించారు కేఏ పాల్. రాష్ట్రాన్ని దోచుకునే కుట్రలో భాగంగా షర్మిలను ఏపీ రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారని అన్నారు పాల్. కులం, దోచుకోవడం, కుటుంబ పాలన కోసమే వీళ్ళందరూ ఏకమవుతున్నారని అన్నారు పాల్. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పాల్ హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్, టీడీపీ, బీజేపీతో కలిసి ప్యాకేజీ స్టార్ గా మారిపోయాడని పాల్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

Read More: Uttarkhand: తప్పతాగి వేగంగా బస్ నడుపుతూ పడిపోయిన డ్రైవర్.. చివరికి అలా?