KA Paul Election Campaign : తాటి ముంజలు కొడుతూ KA పాల్ వినూత్న ప్రచారం…

మొన్నటికి మొన్న వైజాగ్ బీచ్ లో జాలరి అవతారమెత్తిన ఆయన..ఈరోజు తాటి ముంజలు కొడుతూ.. తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు

Published By: HashtagU Telugu Desk
Paul

Paul

విశాఖ ఎంపీగా బరిలోకి దిగిన కేఏ పాల్ (KA Paul) తనదైన ప్రచారంతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగిన అక్కడ ప్రత్యేక్షం అవుతుండడం పాల్ కు అలవాటు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గరి నుండి ఫలితాలు వచ్చేవరకు వార్తల్లో హైలైట్ అవుతుంటారు. గెలుపు సంగతి పక్కన పెడితే ఈయన చేసే హడావిడి..ప్రచారం..చెప్పే హామీలు..ఇచ్చే బిల్డప్ ఇదంతా కూడా ఆయనకు విపరీతమైన క్రేజ్ ను తీసుకొచ్చి పెడుతుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో ఈయన చేసిన ప్రచారం కానీ , హడావిడి కానీ ఇప్పటికి యూట్యూబ్ లో , సోషల్ మీడియా లో వైరల్ అవుతూనే ఉంటాయి.

We’re now on WhatsApp. Click to Join.

మొన్నటికి మొన్న తెలంగాణ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పాల్ గట్టి హడావిడే చేసారు. ఇక ఇప్పుడు ఏపీ ఎన్నికల ప్రచారంలో కూడా అంతే. ప్రజాశాంతి పార్టీ తరుపున విశాఖపట్నం పార్లమెంట్ నుంచి కేఏ పాల్ బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో తన ప్రచారం తో ఆకట్టుకుంటూ వస్తున్నారు. మొన్నటికి మొన్న వైజాగ్ బీచ్ లో జాలరి అవతారమెత్తిన ఆయన..ఈరోజు తాటి ముంజలు కొడుతూ.. తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కుండ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. రాష్ట్రం అప్పులు తీరి అభివృద్ధి జరగాలంటే తనను విశాఖ ఎంపీగా గెలిపించాలని కోరారు. వైసీపీ, టీడీపీని నమ్ముకుంటే ప్రయోజనం ఏమీ ఉండదని ఓటర్లకు తెలిపారు.

Read Also : Modi Speech Pileru Meeting : జగన్ సర్కార్ కు కౌంట్​డౌన్​ స్టార్ట్ – మోడీ

  Last Updated: 08 May 2024, 09:31 PM IST