Site icon HashtagU Telugu

AP : అప్పుడే చంద్రబాబు ను ఏపీ సీఎం చేసిన అధికారులు

Ministers

Ministers

ఏపీలో ఇంకా ఎన్నికల ఫలితాలు (AP Election Results) రానేలేదు..అప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ను ఏపీ సీఎం చేసారు అధికారులు..కాకపోతే మన అధికారులు కాదు..షిర్డీ దేవస్థానం అధికారి ఒకరు..చంద్రబాబు ను ఏపీ సీఎం అని పరిచయం చేసాడు. దీనికి సంబదించిన వీడియో ను టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఏపీలో మే 13 న పోలింగ్ పూర్తి అయినా సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ , 25 పార్లమెంట్ స్థానాలకు సంబదించిన జరిగినా ఈ పోలింగ్ ఫలితాలు జూన్ 04 న వెల్లడి కాబోతున్నాయి. ఈ ఫలితాల ఫై కూటమి నేతలతో పాటు వైసీపీ నేతలు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరికీ వారు 150 + సీట్లు గెలవబోతున్నామని చెపుతున్నారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు పోలింగ్ అనంతరం దైవ దర్శనాల బాట పట్టారు. ఇప్పటికే తిరుపతి వేంకన్నను దర్శించుకున్న బాబు..నిన్న గురువారం మహారాష్ట్రలో గల కొల్హాపూర్‌ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని సతీ సమేతంగా సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడీ వెళ్లారు. షిరిడీలో ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు దంపతులకు ఆలయ అధికారులు జ్ఞాపిక బహుకరించారు. అదే క్రమంలో షిర్డీ లో పర్యటించారు చంద్రబాబు. ఈ సందర్బంగా అక్కడి అధికారులు చంద్రబాబు ను ఏపీ సీఎం అంటూ అక్కడి వారికీ పరిచయం చేసారు. దీనికి సంబదించిన వీడియో ను టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు.

https://x.com/TDP_Germany/status/1791136082597183904

Read Also : Tollywood : ‘మనం’ మళ్లీ చూడబోతున్నాం..