Site icon HashtagU Telugu

TDP : టీడీపీకి నేడు బిగ్‌డే.. చంద్రబాబు కేసుల్లో వెల్ల‌డికానున్న తీర్పులు

Chandrababu Quash Petition

Chandrababu Quash Petition

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడికి సంబంధించిన కేసుల్లో ఈ రోజు కీల‌కం కానుంది. దిగువ కోర్టుల నుంచి సుప్రీంకోర్టుల వ‌ర‌కు ప‌లు కేసుల్లో తీర్పులు వెలువ‌డనున్నాయి. నైపుణ్యాభివృద్ధి సంస్థకు సంబంధించి సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌పై ఈ రోజు (సోమవారం) విచారణ ఉంది.ఈ కేసులో గ‌త వారం సుదీర్ఘంగా వాద‌న‌లు జ‌రిగాయి. ఇరువ‌ర్గాల వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం విచార‌ణ‌ను ఈ రోజు(సోమ‌వారం)కి వాయిదా వేసింది. దీనిపై ఈ రోజు తీర్పు కూడా వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు న్యాయ‌నిపుణులు అంటున్నారు. ఇదే కేసులో తనకు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు వేసిన పిటిషన్‌పై విజయవాడలోని ఏసీబీ కోర్టు ఈ రోజు (సోమ‌వారం) నిర్ణయాన్ని వెల్లడించనుంది. బెయిల్ పిటిష‌న్‌పై సుదీర్ఘంగా వాద‌న‌లు జ‌రిగాయి.

We’re now on WhatsApp. Click to Join.

గ‌త శుక్రవారం తీర్పుని రిజ‌ర్వ్ చేసిన ఏసీబీ కోర్టు ఈ రోజు వెల్ల‌డించ‌నుంది. దీంతోపాటు మరోసారి ‘పోలీసు కస్టడీ’కి కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌పై సైతం ఈ రోజు (సోమ‌వారం) ఏసీబీ కోర్టు తగిన ఉత్తర్వులు జారీచేయనుంది. ఈ రెండు పిటిషన్లపై శుక్ర‌వారం ఏసీబీ కోర్టులో వాదనలు ముగిసిన విషయం తెలిసిందే.. ఇటు హైకోర్టులోనూ చంద్రబాబుకు సంబంధించిన మూడు బెయిలు పిటిషన్లపై సోమవారం తీర్పులు వెల్లడికానున్నాయి. రాజధాని అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అంగళ్లు, ఫైబర్‌ నెట్‌ కేసుల్లో బెయిలు కోసం చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై ఇటీవల వాదనలు ముగియడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డి తీర్పులను రిజర్వు చేసిన సంగతి తెలిసిందే. ఈ మూడు పిటిషన్లలో న్యాయమూర్తి సోమవారం నిర్ణయం వెల్లడించనున్నారు.

Also Read:  Elections Schedule Today : ఇవాళ మధ్యాహ్నమే 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌